ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: అలర్ట్: మరిన్ని దాడులు జరగొచ్చు..!!

ABN, Publish Date - May 16 , 2024 | 06:40 PM

జూన్ 4వ తేదీ లోపు మరిన్ని దాడులు జరగవచ్చని.. ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆ పార్టీ నాయకుడు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు సూచించారు.

Raghurama Krishna Raju

తిరుపతి, మే 16: జూన్ 4వ తేదీ లోపు మరిన్ని దాడులు జరగవచ్చని అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆ పార్టీ నాయకుడు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు సూచించారు. వైసీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని రఘురామకృష్ణంరాజు గురువారం (ఈ రోజు) పరామర్శించారు.

AP Elections: భారీ భద్రత మధ్య ‘జేసీ ఫ్యామిలీ’ హైదరాబాద్‌కు తరలింపు

ప్రశాంతమైన ఆధ్యాత్మిక నగరం తిరుపతి అని.. అలాంటి నగరంలో ఇలాంటి దారుణాలు జరగటం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈవీఎంలు భద్రపరిచిన ప్రదేశానికి మారణాయుధాలతో వచ్చారంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అసలు ఉన్నాయా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చించేందుకే ఏపీ డీఐజీ, చీఫ్ సెక్రటరీని కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు ఢిల్లీకి పిలిపించిందని గుర్తు చేశారు. అసలు చీఫ్ సెక్రటరీ‌ని మార్చేస్తే గొడవేలేదన్నారు.

LokSabha Elections: సీఎం పదవి నుంచి యోగి ఔట్..!


ఈ ఘటనలను చూసిన తర్వాత ముఖ్యమంత్రిని సైతం మారిస్తే మార్చవచ్చంటూ రఘురామకృష్ణరాజు వ్యంగ్యంగా అన్నారు. దీంతో వైసిపి తన ఓటమిను పరోక్షంగా అంగీకరించినట్టు అయిందని స్పష్టం చేశారు.

National Commission for Women: బిభవ్ కుమార్‌కు సమన్లు జారీ

ఉన్మాద స్థితిలో వాళ్ళు ఉన్నారని.. ఈవీఎంలకు మరింత భద్రత పెంచాలని కోరారు. ఇలాంటి సంఘటనల వల్ల జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్‌కి ఏజెంట్లు దొరకని పరిస్థితి ఉండే అవకాశం ఉందని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు.

AP Elections: జేసీ ఫ్యామిలీపై పోలీసుల కక్షసాధింపు..!!

సీఎం వైఎస్ జగన్.. ఐ ప్యాక్ ప్రతినిధుల వద్దకెళ్లి.. ఆయన మాట్లాడన తీరుతో తనకు బాగా నవ్వు తెప్పించిందన్నారు. తక్కువలో తక్కువ 125 అసెంబ్లీ స్థానాలు కూటమికి వస్తాయని.. ఇక ఫ్రెండ్ చెప్పిన ప్రకారం అయితే 150 పైనే స్థానాలు వస్తాయని సీఎం జగన్ చెప్పారని గుర్తు చేశారు.


IncomeTax Raids:72 గంటలు తనిఖీలు: రూ.170 కోట్లు సీజ్

ఎన్నికల్లో గెలవబోతున్నామని.. అందువల్లే మనం సమయమనం పాటించాలని టిడిపి శ్రేణులకు సూచించినట్లు చెప్పారు. కడప లోక్‌సభ స్థానం నుంచి వైయస్ అవినాష్ రెడ్డిపై వైయస్ షర్మిల ఘన విజయం సాధిస్తారన్నారు. అయితే ఉండిలో ఇద్దరు అభ్యర్థులకు సీఎం జగన్ నిధులు సమకూర్చారని ఆరోపించారు.

LokSabha Elections: సీఎం పదవి నుంచి యోగి ఔట్..!

తాను గెలవబోతున్నట్లు రఘురామ స్పష్టం చేశారు. అలాగే పిఠాపురంలో పవన్ కల్యాణ్.. 55 వేల మేజార్టీతో గెలవబోతున్నారని వివరించారు. జగన్ పాలనలో ప్రజల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయని.. చర్యలు తప్పనిసరిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ క్రమంలో తప్పకుండా చర్యలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


Assembly Elections: సీఎంగా ఉచిత విద్యుత్‌పై తొలి ఉత్తర్వులు

గతంలో తనను కొట్టిన ఐదుగురు పోలీసులను పడుకోబెట్టి కొట్టానని.. వారిపై న్యాయ పరంగా చర్యలు తీసుకుంటానన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు.. వైసిపి లోపలే అంతర్యుద్దం ప్రారంభమవుతుందని తెలిపారు.

Read Latest AP News AND Telugu News

Updated Date - May 16 , 2024 | 07:29 PM

Advertising
Advertising