CM Jagan: జగన్ ఎన్నికల ప్రచారానికి ఆర్టీసీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు
ABN, Publish Date - Mar 19 , 2024 | 08:01 AM
ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి ఆర్టీసీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. జగన్ ప్రచార రథం కోసం పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వినియోగిస్తున్నారు. పంజాబ్‌లోని అంబాల వద్ద గల జేసీబీఎల్ కంపెనీలో వాహనాలను ఆర్టీసీ అధికారులు తయారు చేయించారు.
అమరావతి: ఏపీ సీఎం జగన్ (CM Jagan) ఎన్నికల ప్రచారానికి (Election Campaign) ఆర్టీసీ (RTC) బుల్లెట్ ప్రూఫ్ బస్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. జగన్ ప్రచార రథం కోసం పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వినియోగిస్తున్నారు. పంజాబ్ (Punjab)లోని అంబాల వద్ద గల జేసీబీఎల్ కంపెనీ (JCBL Company)లో వాహనాలను ఆర్టీసీ అధికారులు తయారు చేయించారు. బస్సులో అత్యాధునికమైన.. విలాసవంతమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఒక్కొక్కటి 13 కోట్ల రూపాయలతో తయారు చేస్తున్నారు.
మరో మూడు మినీ బస్సులను సిద్ధం చేశారు. వీటి ఖరీదు దాదాపు పది కోట్ల రూపాయలని సమాచారం. ఇప్పటికే విజయవాడ (Vijayawada)కు ఒక బుల్లెట్ గ్రూప్ బస్సు.. మూడు మినీ బస్సులు వచ్చాయి. వాటిని వైసీపీ (YCP) ప్రోగ్రాం కమిటీ ఇన్‌చార్జ్ తలశిల రఘురాం ఆర్టీసీ డిపోకు వెళ్లి మరీ పూర్తిస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల కోడ్ రావడానికి ఒక రోజు ముందు బుల్లెట్ ప్రూఫ్ బస్సు నగరానికి వచ్చింది. మరో వారం రోజుల్లో మరో బుల్లెట్ ప్రూఫ్ బస్సు నగరానికి రానుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అద్దె ప్రాతిపాదికన బస్సులను తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Skill Development Case: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు విచారణ
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 19 , 2024 | 08:01 AM