AP Elections: జనసేన ఎంపీ అభ్యర్థి ముఖంపై సీల్ ముద్ర.. టీడీపీ ఆందోళన
ABN, Publish Date - May 13 , 2024 | 06:55 AM
Andhrapradesh: ఏపీలో పోలింగ్ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది నిమిషాలే సమయం ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద అధఇకారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోగా.. ఓటర్లు ఒక్కొక్కరుగా పోలింగ్ బూత్ వద్దకు వస్తున్నారు. అయితే పోలింగ్ ప్రారంభకాకముందే కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపాడు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.
కాకినాడ, మే 13: ఏపీలో పోలింగ్ (AP Elections 2024) ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది నిమిషాలే సమయం ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద అధఇకారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోగా.. ఓటర్లు ఒక్కొక్కరుగా పోలింగ్ బూత్ వద్దకు వస్తున్నారు. అయితే పోలింగ్ ప్రారంభకాకముందే కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపాడు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో టీడీపీ శ్రేణులు (TDP) ఆందోళనకు దిగారు. బ్యాలెట్ పేపర్‌లో కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి (Janasena MP Candidate) ముఖం కనిపించకుండా కలెక్టర్ సీల్ ముద్ర వేశారు. దీంతో ఓటర్లకు (Voters) ఎంపీ అభ్యర్థి ముఖం కనిపించని పరిస్థితి ఏర్పడింది.
AP Elections 2024: ఈ ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు వరకే పోలింగ్
అధికారుల చర్యలపై తెలుగు దేశం తమ్ముళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి కాదు రెండు దాదాపు 14 గ్రామాల్లో జనసేన ఎంపీ అభ్యర్థి ముఖంపై సీల్ ముద్ర పడింది. దీంతో ఈ విషయంలో ఆర్వోకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఫిర్యాదుపై స్పందించిన ఆర్వో దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ ప్రారంభానికి ముందే బ్యాలెట్ పేపర్‌లో ఎంపీ అభ్యర్థి ముఖం కనిపించేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
AP Elections: 7 గంటలకే ఓటు హక్కు వినియోగించుకోనున్న చంద్రబాబు
AP Elections 2024: రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన మాక్ పోలింగ్
Read Latest AP News And Telugu News
Updated Date - May 13 , 2024 | 06:58 AM