AP Elections: వైసీపీ ఓటమిని.. ముందే పసిగట్టిన సీనియర్లు..!
ABN, Publish Date - Apr 08 , 2024 | 07:01 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముని గిపోతున్న నావలా తయారైంది. ఎన్నికలకు ముందే రాజకీయ దిగ్గజాలు ఆపార్టీని వీడుతున్నారు. ఒకరిద్దరంటే అనుకోవచ్చు.. పదుల సంఖ్యలో ప్రముఖ నాయకులు జగన్‌కు గుడ్‌బై చెబుతున్నారు.. వేల సంఖ్యలో ద్వితీయ శ్రేణి నాయకులు వైసీపీని వదిలి వెళ్లిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పరిస్థితి మునిగిపోతున్న నావలా తయారైంది. ఎన్నికలకు ముందే రాజకీయ దిగ్గజాలు ఆపార్టీని వీడుతున్నారు. ఒకరిద్దరంటే అనుకోవచ్చు.. పదుల సంఖ్యలో ప్రముఖ నాయకులు జగన్(Jagan)కు గుడ్‌బై చెబుతున్నారు.. వేల సంఖ్యలో ద్వితీయ శ్రేణి నాయకులు వైసీపీని వదిలి వెళ్లిపోతున్నారు. ఎన్నికల వేళ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు స్థానిక పరిస్థితుల ఆధారంగా పార్టీలు మారడం సహజం. కాని రాజకీయంగా ఓ వెలుగు వెలిగి.. పార్టీ అధికారంలోకి వస్తే పదవులు గ్యారంటీ ఉన్న నాయకులు వైసీపీని వీడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెడితే అనంతపురం వరకు కేంద్రమాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీని వీడి వెళ్లిపోయారు.
Balasouri: మూడు రాజధానుల పేరుతో ఏపీని నాశనం చేసిన సీఎం జగన్
సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి..
జగన్ ఐదేళ్ల పాలనపై ప్రజలే కాదు.. సొంత పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారడానికి ఇదే నిదర్శనం సీనియర్ నేతలు పార్టీని వదిలి వెళ్లడం. దశాబ్ధాల తరబడి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై ఓ అవగాహన ఉంటుంది. మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తెలియడంతో సీనియర్లంతా వైసీపీకి ఎన్నికలకు ముందే గుడ్ బై చెప్పి వెళ్లిపోతున్నారనే చర్చ జరుగుతోంది.
సీనియర్లు గుడ్‌బై..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి , ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాలు వైసీపీని వీడారు. వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో పాటు.. ఆపార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉండదని వీళ్లంతా ముందే ఊహించి జగన్‌కు గుడ్‌బై చెప్పేశారనే ప్రచారం సాగుతోంది.
అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్, శింగనమల మాజీ ఎమ్మెల్యే యామిని బాల, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీని వీడి వెళ్లిపోయారు. వీళ్లంతా ఆయా జిల్లాలో ఎంతో ప్రభావవంతమైన నాయకులు. గురజాల మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వంటి ఎందరో కీలక రాజకీయ నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు. వీళ్లతో పాటు మరెందరో జిల్లా స్థాయి నేతలు సైతం వైసీపీని వదిలి వెళ్లిపోయారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఏ మాత్రం విశ్వాసం ఉన్నా.. వాళ్లంతా ఆచితూచి వ్యవహరించేవాళ్లు. కానీ జగన్ పార్టీ మరోసారి గెలిచే ఛాన్స్ లేదన్న పూర్తి అంచనాలతోనే వారంతా పార్టీని వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ ప్రభుత్వంపై సొంత పార్టీ నాయకులే తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అర్థమవుతోంది. ఇప్పటికైనా జగన్ తెలుసుకోవల్సింది ఒకటే.. ఆంధ్రప్రదేశ్‌లో తన ప్రభుత్వానికి ఎక్స్‌పైరీ డేట్ దగ్గరపడిందని. కుట్రలు, కుతంత్రాలతో ప్రజల ఆదరాభిమానాలు పొందలేమని, కక్షపూరిత రాజకీయం చేస్తే మనవాళ్లే మనతో ఉండరనే వాస్తవాన్ని జగన్ ఇప్పటికైనా గ్రహించాల్సిన అవసరముందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
YSRCP VS TDP: మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. టీడీపీ నేతలపై దాడి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Apr 08 , 2024 | 07:01 AM