AP Elections: ఎన్నికల ప్రచారానికి దూరంగా శింగనమల టీడీపీ అభ్యర్థి!
ABN, Publish Date - May 07 , 2024 | 11:38 AM
Andhrapradesh: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. మండుటెండల్లోనే రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు రోజుల వ్యవధే ఉండటంతో ఎండలను కూడా లెక్క చేయకుండా అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే మండే ఎండల్లో ప్రచారం నిర్వహిండచంతో పలువురు అభ్యర్థులు కాస్త అనారోగ్యానికి గురవుతున్నారు..
అనంతపురం, మే 7: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. మండుటెండల్లోనే రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలు (Election Camapaign) నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు రోజుల వ్యవధే ఉండటంతో ఎండలను కూడా లెక్క చేయకుండా అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే మండే ఎండల్లో ప్రచారం నిర్వహిండచంతో పలువురు అభ్యర్థులు కాస్త అనారోగ్యానికి గురవుతున్నారు. శింగనమల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ (Singanamala TDP candidate Bandaru Sravani Sree) వడదెబ్బకు (sunburned) గురయ్యారు.
TDP: గజపతినగరంలో టీడీపీ జోరు.. శ్రీనివాస్ దెబ్బకు బొత్స కుటుంబం విలవిల
దీంతో గత రెండు రోజులుగా అనంతపురంలోని స్వగృహంలో శ్రావణి వైద్య సేవలు పొందుతున్నారు. వడదెబ్బ కారణంగా టీడీపీ అభ్యర్థి ప్రచార కార్యకరమానికి దూరమయ్యారు. మరోవైపు విషయం తెలిసిన శింగనమల టీడీపీ నేతలు, కార్యకర్తలు శ్రావణి శ్రీని పరామర్శించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ‘‘ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి గ్రామాల్లో కలిసికట్టుగా ప్రచారం చేస్తాం’’ అంటూ శ్రావణికి టీడీపీ నేతలు, కార్యకర్తలు భరోసా ఇస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవద్దని, రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారంలోకి వస్తానని శ్రావణి శ్రీ తెలుగు తమ్ముళ్లకు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
TDP: గజపతినగరంలో టీడీపీ జోరు.. శ్రీనివాస్ దెబ్బకు బొత్స కుటుంబం విలవిల
Lok Sabha Elections: తెలుగు మహిళకు భారీ షాక్.. చివరి క్షణంలో అభ్యర్థి మార్పు.. కారణం అదేనా..?
Read Latest AP News And Telugu News
Updated Date - May 07 , 2024 | 11:58 AM