ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: ఇద్దరి నినాదం ఒకటే.. చేతులు కలిపిన కేసీఆర్, జగన్..

ABN, Publish Date - May 08 , 2024 | 02:50 PM

ఎన్నికల వేళ ఎవరి నినాదాలు వారివి.. ఏపార్టీ వ్యూహాలు వారివి. గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారివి.. కానీ ఆ రెండు పార్టీల విషయంలో మాత్రం అంతా రివర్స్ అనే ప్రచారం జరగుుతోంది. ఇద్దరి నినాదం ఒకటే.. ఇద్దరి వ్యూహాలు ఒకటే.. నీకోసం నేను.. నా కోసం నువ్వు అంటూ కలిసిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నీకు నేను, నాకు నువ్వు అనుకుంటూ అడుగులు వేస్తున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది.

Jagan and KCR

ఎన్నికల వేళ ఎవరి నినాదాలు వారివి.. ఏపార్టీ వ్యూహాలు వారివి. గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారివి.. కానీ ఆ రెండు పార్టీల విషయంలో మాత్రం అంతా రివర్స్ అనే ప్రచారం జరగుుతోంది. ఇద్దరి నినాదం ఒకటే.. ఇద్దరి వ్యూహాలు ఒకటే.. నీకోసం నేను.. నా కోసం నువ్వు అంటూ కలిసిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నీకు నేను, నాకు నువ్వు అనుకుంటూ అడుగులు వేస్తున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది. ఈ వ్యాఖ్యలను బలపర్చేలా గతంలో కేసీఆర్ వ్యవహారించిన తీరును సోషల్ మీడియా పోస్టుల్లో ప్రస్తావిస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ పాలకులతో వైరం పెంచుకుని, వారిని దుర్భాషలాడే కేసీఆర్‌తో రాష్ట్రవిభజన తర్వాత జగన్ స్నేహం మొదలుపెట్టడం ఏపీ ప్రజలను అవమానించడం కాదా అంటూ సామాజిక మాద్యమాల్లో ప్రశ్నలు సంధిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌కు కీడు చేసే వ్యక్తులతో కలిసి ఏపీ సీఎం జగన్ వ్యూహలు రచిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదిగో.. ఎన్నికల్లో ఇద్దరి నినాదాలు ఒకటే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. జగన్ సిద్ధం నినాదాన్ని ఎత్తుకుంటే.. కేసీఆర్ సైతం అదే సిద్ధం నినాదాన్ని ఎన్నికల్లో ఎత్తుకోవడం చూస్తుంటే ఇద్దరూ కలిసే పనిచేస్తున్నారంటూ కొందరు నెటిజన్లు తమ సోషల్ మీడియా పోస్టుల్లో ప్రస్తావిస్తున్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 'ద్రోహులతో యుద్ధం.. మన సేనాని సిద్ధం' నినాదంతో పేపర్ ప్రకటనలు ఇచ్చారు. జగన్ చాలా సభల్లో ద్రోహులతో యుద్ధానికి సిద్ధమని ప్రస్తావించారని.. దీంతో ఈ ఇద్దరు కలిసి అడుగులు వేస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్‌కు జగన్ ఆర్థిక సాయం అందించారనే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు కేసీఆర్ సైతం వైసీపీకి మద్దతు పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.

AP Elections: నెల్లూరులో వైసీపీ ఎదురీత.. కంచుకోట కూలుతోందా..!?


ఎందుకు కలుస్తున్నారంటూ..

ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, వైసీపీ గెలవడం కష్టమని అనేక సర్వే సంస్థలు, రాజకీయ పండితులు చెప్పారు. అయినా ఏపీలో ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎన్డీయే కూటమిని ఓడించేందుకు వైసీపీ చేసే కుట్రలకు కేసీఆర్ మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఓడిపోయినప్పటికీ.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీకి కేసీఆర్ సాయం చేస్తున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. తెలంగాణలో అధికారం కోల్పోవడంతో ఏపీలో వైసీపీ ఓడిపోతే తమకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతోనే వైసీపీకి మద్దతు ఇస్తున్నారంటూ సామాజిక మాద్యమాల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం భూములు దోచుకుందనే ఆరోపణలు ఉన్నాయని.. ఇవే ఆరోపణలు వైసీపీ ప్రభుత్వంపై ఏపీలో ఉన్నాయని.. అందుకే భూములు దోచుకోవడంలో ఇద్దరూ ఒకటేనంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తెలంగాణలో అవకాశం లేకపోవడంతో ఏపీలో వైసీపీ గెలిస్తే ల్యాండ్ స్కామ్స్ చేయవచ్చనే ఆలోచనతోనే కేసీఆర్ జగన్‌కు మద్దతు ఇస్తున్నారా అంటూ మరికొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


వైరల్ అవుతున్న పోస్టులు..

ఏపీలో వైసీపీని ఓడించడానికి మేమంతా సిద్ధమనే నినాదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో జగన్ సిద్ధం నినాదాన్ని ప్రజలు నమ్మడంలేదనేది స్పష్టమవుతోంది. ఇక తెలంగాణలోనూ కేసీఆర్‌ను ప్రజలు నమ్మడం లేదనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ప్రజలు నమ్మకాన్ని కోల్పోయిన ఇద్దరు నేతలు సిద్ధం నినాదాలతో ఏం సాధిస్తారనేది జూన్4న చూద్దాంమంటూ మరికొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.


YSRCP: అర్ధరాత్రి కవ్వింపు చర్యలు.. టీడీపీ నేతలపై వైసీపీ మూకల దాడి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News And Telugu News

Updated Date - May 08 , 2024 | 03:19 PM

Advertising
Advertising