ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: అంతలోనే మాట మారింది..?

ABN, Publish Date - May 15 , 2024 | 03:55 AM

మళ్లీ మేమే గెలుస్తున్నామన్నారు.. మహిళలు, వృద్ధులు, యువత పెద్దఎత్తున ఓట్లేశారని.. ఇవి మాకే పడ్డాయన్నారు.. సోమవారం పోలింగ్‌ ముగిసీ ముగియగానే..

ycp fear

ఒక్క పూటలోనే వైసీపీ మాట మారింది

మహిళలు, వృద్ధులు తమకే ఓటేశారన్న సజ్జల.. జగన్‌ యువతకు

ఐకాన్‌ అని అభివర్ణన.. తెల్లవారేసరికి టీడీపీపై రిగ్గింగ్‌ ఆరోపణలు

ఈసీ తీరు ఏకపక్షమని, పోలీసులు సహకరించలేదని బుకాయింపు

ఇంకోవైపు ఊళ్లలో టీడీపీపై దాడులు.. వైసీపీ నేతల తీరుపై అనుమానాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మళ్లీ మేమే గెలుస్తున్నామన్నారు.. మహిళలు, వృద్ధులు, యువత పెద్దఎత్తున ఓట్లేశారని.. ఇవి మాకే పడ్డాయన్నారు.. సోమవారం పోలింగ్‌ ముగిసీ ముగియగానే.. వరుసగా రెండోసారీ అధికారంలోకి వచ్చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. సీఎం జగన్‌ను యువతకు ఐకాన్‌గా ఆకాశానికెత్తేశారు. వారంతా వైసీపీ వైపే నిలబడ్డారని అన్నారు. మంగళవారం ఉదయానికి మాట మారిపోయింది. టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దీంతో వారి మాటల్లో ఏదో తేడా కొడుతోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గెలుపుపై ధీమా సడలిందా అన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్‌ ముగిసి 24గంటలు ముగియక ముందే.. సజ్జలతో పాటు కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్‌నేతలు, అభ్యర్థులు మంగళవారం ఈసీపై దుమ్మెత్తిపోశారు. పోలీసులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను చెప్పుచేతల్లో పెట్టుకున్న వైసీపీ పెద్దలు.. నిన్నటిదాకా సింహం సింగిల్‌గా వస్తుందన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని ఎద్దేవాచేశారు. ఎంతమంది కలిసినా తమను ఎదుర్కోలేరని తొడలు కొట్టారు. వైనాట్‌ 175 అని ఊదరగొట్టి.. పోలింగ్‌ ముగిశాక ఎంతలేదన్నా 130కి తగ్గవని కొందరు నేతలు అన్నారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే సీనియర్‌ నేతలంతా కూడబలుక్కుని మాట్లాడినట్లు.. టీడీపీ రిగ్గింగ్‌ చేసిందని ఆక్రోశించడంలోని మర్మమేమిటా అని రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయి. భారీపోలింగ్‌తో జగన్‌ అండ్‌ కో గుండెలు జారిపోయాయా..


కీడు శంకిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నాయి. సోమవారం పోలింగ్‌ సందర్భంగా తమ అరాచకాలను కప్పిపుచ్చుకునేందుకు స్వరం మార్చారా అన్న సందేహం కూడా వ్యక్తంచేస్తున్నాయి. టీడీపీ నేతలు తనను కొట్టి చంపేశాలా ఉన్నారంటూ జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థి సుధీర్‌రెడ్డి.. తమను కొట్టి తరిమేశారంటూ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌, గురజాల అసెంబ్లీ అభ్యర్థి కాసు మహేశ్‌రెడ్డి.. తనను బూత్‌లోకి రానివ్వలేదంటూ గంగాధర నెల్లూరు వైసీపీ అభ్యర్థి కృపాలక్ష్మి.. తమను కొట్టారని నరసరావుపేట అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. ఊర్లోకి రానివ్వలేదని చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి.. గృహనిర్బంధం చేశారని తాడిపత్రి అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి.. సత్తెనపల్లిలో పెద్దఎత్తున రిగ్గింగ్‌ జరిగిందని అక్కడి అభ్యర్థి, మంత్రి అంబటి రాంబాబు హాహాకారాలు చేశారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కూడా పోలీసులు టీడీపీకి పనిచేశారని ఆరోపించారు. ఈసీ వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిందని, ఏకపక్షంగా వ్యవహరించిందని సజ్జల ఆరోపించారు. సోమవారం పోలింగ్‌ సందర్భంగా వీరే దాడులకు పాల్పడ్డారు. కోడ్‌ను తుంగలో తొక్కి వీధుల్లో సైర్వవిహారం చేశారు. మంగళవారం ఇలా ఆరోపణలు చేస్తూనే ఊళ్లపై పడి టీడీపీ నేతలపై దాడులకు తెగబడ్డారు. కాసు మహేశ్‌రెడ్డి, పిన్నెల్లి సోదరులు, అనిల్‌కుమార్‌ యాదవ్‌ అనుచరులతో కలసి వీరంగం సృష్టించడం గమనార్హం. ఓటమి భయంతోనే ఇలా హింసాకాండకు తెగించారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - May 15 , 2024 | 12:59 PM

Advertising
Advertising