మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: గులకరాయి నాటకంలో వెల్లంపల్లి ఓ బఫూన్...

ABN, Publish Date - Apr 15 , 2024 | 04:33 PM

Andhrapradesh: బూటకపు గులకరాయి నాటకంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఓ బఫూన్ అంటూ టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడకు చెందిన పులికేశి వెల్లంపల్లి.. జగన్ రాక సందర్భంగా జగన్నాటకానికి తెరతీశారని ఆరోపించారు. రాయి డ్రామా రోజున జగన్ పర్యటించే రూట్ మ్యాప్‌ను బయట పెట్టలేదని తెలిపారు. గతంలో చీకటి ఉన్నందున ర్యాంప్ పైకి రాలేనన్న జగన్ నేడు ఎలా వచ్చారని ప్రశ్నించారు. రాయి సాక్ష్యాలు చూపితే 2 లక్షలిస్తామని పోలీసు కమిషనర్ ప్రకటించడం జనాన్ని పిచ్చోళ్లను చేయడమే అంటూ వ్యాఖ్యలు చేశారు.

TDP: గులకరాయి నాటకంలో వెల్లంపల్లి ఓ బఫూన్...
TDP Leader Dundi Rakesh

అమరావతి, ఏప్రిల్ 15: బూటకపు గులకరాయి నాటకంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (Former Minister Vellampalli Srinivas) ఓ బఫూన్ అంటూ టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ (TDP Leader Dundi Rakesh) వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడకు చెందిన పులికేశి వెల్లంపల్లి.. జగన్ (CM Jagan) రాక సందర్భంగా జగన్నాటకానికి తెరతీశారని ఆరోపించారు. రాయి డ్రామా రోజున జగన్ పర్యటించే రూట్ మ్యాప్‌ను బయట పెట్టలేదని తెలిపారు. గతంలో చీకటి ఉన్నందున ర్యాంప్ పైకి రాలేనన్న జగన్ నేడు ఎలా వచ్చారని ప్రశ్నించారు.

TS Police: పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నేత డ్యాన్స్‌పై విమర్శల వెల్లువ.. వీడియో వైరల్!


రాయి సాక్ష్యాలు చూపితే 2 లక్షలిస్తామని పోలీసు కమిషనర్ ప్రకటించడం జనాన్ని పిచ్చోళ్లను చేయడమే అంటూ వ్యాఖ్యలు చేశారు. 48 గంటలైనా జగన్‌కు తగిలిన యుఎఫ్ఓ బయటికి రాలేదన్నారు. జగన్‌కు తగిలిన రాయి టీడీపీ పని అని రెండు రోజుల నుంచి గగ్గోలు పెట్టడంలో అర్థంలేదని మండిపడ్డారు. కోడికత్తి శీనును బలిచేసినట్లు మరొకరిని బలిచేయాలని చూస్తున్నారని తెలిపారు. జగన్ ఆధ్వర్యంలో జరిగిన జగన్నాటకంపై చర్యలు తీసుకోవాలని డూండి రాకేష్ డిమాండ్ చేశారు.


పోలీసుల ప్రకటన ఇదే..

అయితే ముఖ్యమంత్రిపై దాడి చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ఓ బంపరాఫర్‌ను ప్రకటించారు. సీఎం జగన్‌పై రాయి వేసిన వారి ఆచూకీ చెబితే రెండు లక్షల బహుమతి అంటూ ఖాకీలు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. నిందితులను పట్టుకునేందుకు దోహదపడే ఖచ్చితమైన సమాచారాన్ని, సెల్ ఫోన్, వీడియో రికార్డింగ్స్‌ను అందించాలని కోరారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా నేరుగా వచ్చి కలవాలని సూచించారు. కేసుకు దోహదపడే సమాచారం అందించినవారికి 2 లక్షల రూపాయల నగదును బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. అయితే సమాచారం ఇచ్చిన వారి వివరాలు బయటపెట్టమని.. గోప్యంగా ఉంచుతామని అన్నారు. నిందితుల వివరాలను తెలిపేందుకు ఇద్దరు పోలీసు అధికారుల ఫోన్‌ నెంబర్లను అందుబాటులో ఉంచారు.


ఇవి కూడా చదవండి..

AP Election 2024: చంద్రబాబు వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి: మంత్రి బొత్స

Kavitha: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ స్పెషల్ కోర్టు వార్నింగ్.. అసలేం జరిగిందంటే..!?

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 15 , 2024 | 05:06 PM

Advertising
Advertising