AP News: బాపట్ల జిల్లా పోలీసులకు తెనాలి కోర్టు సమన్లు
ABN, Publish Date - Apr 26 , 2024 | 05:27 PM
ఏపీ ఎన్నికల (AP Election 2024) ముందు ఏపీ పోలీసుల (AP Police) కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్ననే అధికార వైసీపీకి సహకరిస్తున్నారనే విషయంపై ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసిన విషయం తెలిసిందే.
బాపట్ల జిల్లా: ఏపీ ఎన్నికల (AP Election 2024) ముందు ఏపీ పోలీసుల(AP Police) కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్ననే అధికార వైసీపీకి సహకరిస్తున్నారనే విషయంపై ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాపట్ల జిల్లా పోలీసులపై తెనాలి కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా పోలీసులకు తెనాలి కోర్టు శుక్రవారం నాడు సమన్లు జారీ చేసింది. చుండూరు మండలం చుండూరు గ్రామానికి చెందిన గుదేటి బాలకోటిరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసింది.
Andhra Pradesh: పసుపు అడ్డాలో పట్టు ఎవరిదో?
తెలుగు యువత నాయకుడు బాలకోటిరెడ్డిని 2023 జూలై 2వ తేదీన పోలీసులు నిర్బంధించారు. చుండూరు సీఐ, అమర్తలూరు ఎస్సై, చుండూరు ఎస్సై, భట్టిప్రోలు ఎస్సై, నగరం ఎస్సై కలిసి అక్రమంగా తనను నిర్బంధించినట్లు బాలకోటిరెడ్డి ఫిర్యాదు చేశారు. తెనాలి రెండో అడిషనల్ జ్యూడిషియల్ మేజిస్టేట్ ముందు బాలకోటిరెడ్టి వాగ్మూలం ఇచ్చారు. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా దాడి నిజమని తేలడంతో తెనాలి కోర్టు ఈ చర్యలు చేపట్టింది. పోలీస్ అధికారులపై కోర్టులో బాలకోటిరెడ్టి ఫిర్యాదు దాఖలు చేశారు. ఆధారాలు పరిశీలించిన తర్వాత పోలీసులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
TDP: వైఎస్ షర్మిల నిన్న ఒక రహస్యం చెప్పారు: కనకమేడల
కోర్టు ఆదేశాల మేరకు 2024 ఏప్రిల్ 25వ తేదీన కేసు నమోదు దాఖలైంది. ఐపీసీ సెక్షన్ 365, 346, 324,509 ప్రకారం కేసు నమోదు చేశారు. ఐదుగురు పోలీసు అధికారులకు సంబంధించి తెనాలి కోర్టు సమన్లు జారీ చేసింది. కాగా.. స్థానిక నేతల అవినీతిని ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో ఈ కేసు నమోదు చేసినట్లు సమాచారం. వైసీపీ నేతలు, పోలీసులు కమ్ముక్తై బాలకోటిరెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతోనే బాలకోటిరెడ్డిపై పోలీసులు కక్షసాధింపు చర్యలతో బాలకోటిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
AP Elections: మేమెప్పుడూ బీజేపీతో చెట్టా పట్టాలేసుకుని తిరగలేదన్న బొత్స
AP Elections: ఎన్నికల బరి నుంచి కొడాలి నాని ఔట్..!
Read Latest Andhra Pradesh News or Telugu News
Updated Date - Apr 26 , 2024 | 06:00 PM