AP Election Polling 2024:వారిని వెంటనే గృహ నిర్బంధం చేయాలి.. ఈసీ వార్నింగ్
ABN, Publish Date - May 13 , 2024 | 04:55 PM
సజావుగా సాగాల్సిన ఎన్నికల వేడుకను వైసీపీ నేతలు (YSRCP Leaders) రసాభసాగా మార్చేస్తున్నారు. అధికార మదంతో పోలింగ్ బూతుల (Polling Booths) వద్ద రెచ్చిపోతున్నారు. తమ పార్టీకే ఓట్లు వేయాలంటూ ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడమే కాదు.. ఉద్దేశపూర్వకంగానే టీడీపీ (TDP) కార్యకర్తలు, ఓటర్లు, రిపోర్టర్లపై దాడులకు తెగబడుతున్నారు.
అమరావతి: సజావుగా సాగాల్సిన ఎన్నికల వేడుకను వైసీపీ నేతలు (YSRCP Leaders) రసాభసాగా మార్చేస్తున్నారు. అధికార మదంతో పోలింగ్ బూతుల (Polling Booths) వద్ద రెచ్చిపోతున్నారు. తమ పార్టీకే ఓట్లు వేయాలంటూ ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడమే కాదు.. ఉద్దేశపూర్వకంగానే టీడీపీ (TDP) కార్యకర్తలు, ఓటర్లు, రిపోర్టర్లపై దాడులకు తెగబడుతున్నారు.
తాజాగా.. తెనాలి, మాచర్ల, అనంతపురంలో జరుగుతున్న ఘటనలపై ఎన్నికల సంఘం (Election Commission) తీవ్రంగా పరిగణించింది. అల్లర్లు, అరాచకాలు సృష్టిస్తున్న వారిపై గృహనిర్బంధంతో పాటు కేసులు పెట్టాలని ఆదేశించారు. పుంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. సాయంత్రం 4 - 6 గంటల మధ్య ఎలాంటి సంఘటనలు జరిగినా చర్యలు తీవ్రంగా ఉంటాయని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
AP Elections: ఏపీలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. టీడీపీ ఏజెంట్లపై దాడులు..?
Updated Date - May 13 , 2024 | 05:00 PM