AP Elections 2024: మాచర్లలో 52మందిపై రౌడీషీట్.. ఎందుకంటే..?
ABN, Publish Date - May 29 , 2024 | 07:39 AM
మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా దాడులకు తెగబడిన 52మందిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. వెల్దుర్తి మండలానికి చెందిన 14మంది, మాచర్ల టౌన్‌కు చెందిన 10మంది, మాచర్ల రూరల్‌కు చెందిన 22మంది, కారంపూడి మండలానికి చెందిన ఆరుగురిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు.
పల్నాడు: మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా దాడులకు తెగబడిన 52మందిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. వెల్దుర్తి మండలానికి చెందిన 14మంది, మాచర్ల టౌన్‌కు చెందిన 10మంది, మాచర్ల రూరల్‌కు చెందిన 22మంది, కారంపూడి మండలానికి చెందిన ఆరుగురిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. వీరంతా ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు పాల్పడినవారే. వీడియో ఫుటేజ్ ఆధారంగా వారిపై కేసులు, రౌడీ షీట్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అసలేం జరిగింది..?
ఎన్నికల వేళ వారు చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండతో వీరంతా దాడులకు తెగబడ్డారు. పిన్నెల్లి ఈవీఎంలు ధ్వంసం చేయగా... అతని అనుచరులు, వైసీపీ శ్రేణులు రౌడీయిజం చేస్తూ సామాన్యులు, టీడీపీ శ్రేణులపై బరితెగించి దాడులు చేశారు. ఈ ఘర్షణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు.. వీడియోల ఆధారంగా 52మందిపై రౌడీషీట్, కేసులు నమోదు చేశారు.
For more AP news and Telugu news..
Updated Date - May 29 , 2024 | 07:57 AM