AP Election Results: 25 ఏళ్ల తర్వాత ఉరవకొండ సెంటిమెంట్‌కు బ్రేక్..
ABN, Publish Date - Jun 04 , 2024 | 02:07 PM
ఏపీ ఎన్నికల ఫలితాలు అనేక రికార్డులును బద్దలు కొట్టింది. ఎన్నో సెంటిమెంట్లను బ్రేక్ చేసింది. తెలుగుదేశం, బీజేపీ గత 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని స్థానాలను ఈ ఎన్నికల్లో గెలుచుకుంది. ప్రధానంగా ఉరవకొండ సెంటిమెంట్‌ను ఈ ఎన్నికలు బ్రేక్ చేశాయి.
ఏపీ ఎన్నికల ఫలితాలు అనేక రికార్డులును బద్దలు కొట్టింది. ఎన్నో సెంటిమెంట్లను బ్రేక్ చేసింది. తెలుగుదేశం, బీజేపీ గత 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని స్థానాలను ఈ ఎన్నికల్లో గెలుచుకుంది. ప్రధానంగా ఉరవకొండ సెంటిమెంట్‌ను ఈ ఎన్నికలు బ్రేక్ చేశాయి. 1999 నుంచి ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఉండేది. 1999 ఎన్నికల్లో ఉరవకొండ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి ఎల్లారెడ్డిగారి శివరామిరెడ్డి గెలవగా.. ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చింది.
AP Election Result 2024 Live Updates: టెన్షన్ టెన్షన్.. ఏపీ అసెంబ్లీ కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్.
2004, 2009 ఎన్నికల్లో ఉరవకొండ ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలవగా గెలుపొందగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 2014లో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి గెలవగా ఆ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 2019లో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలవగా ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దీంతో ఈ ఎన్నికల్లో ఉరవకొండలో ఏ పార్టీ గెలుస్తుందో.. ఆ పార్టీ అధికారంలోకి రాదని అంతా భావించారు. కానీ 25 ఏళ్ల తర్వాత ఆ సెంటిమెంట్ బ్రేక్ అయింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలవగా రాష్ట్రంలో మెజార్టీ సీట్లను టీడీపీ గెలుచుకుంది. దీంతో ఉరవకొండ సెంటిమెంట్ బ్రేక్ అయింది.
Lok Sabha Election Results 2024 Live Updates: దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Andhra Pradesh News and Latest Telugu News
Updated Date - Jun 04 , 2024 | 02:07 PM