AP Elections: తాడేపల్లి 'కొంప' ముంచిందా.. భయంతో బతుకుతున్న జగన్..!
ABN, Publish Date - May 04 , 2024 | 12:44 PM
అధికారం ఉన్నంత సేపు ఒకరకం.. అధికారం పోతుందంటే మరొక రకంలా తయారైంది ఏపీ సీఎం వైఎస్.జగన్ పరిస్థితి. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా వాస్తుని, ముహుర్తాలను నమ్ముతూ ఉంటారు. కానీ జగన్ గత ఐదేళ్ళలో తనకు నచ్చిందే చేసుకుంటూ వెళ్లారు. వాస్తును అసలు పట్టించుకోలేదు. అది అతని వ్యక్తిగత నిర్ణయం కావచ్చు. అయితే ఐదేళ్ల తర్వాత జగన్‌లో అధికారం కోల్పోతున్నామనే భయం మొదలైందట.
అధికారం ఉన్నంత సేపు ఒకరకం.. అధికారం పోతుందంటే మరొక రకంలా తయారైంది ఏపీ సీఎం వైఎస్.జగన్ పరిస్థితి. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా వాస్తుని, ముహుర్తాలను నమ్ముతూ ఉంటారు. కానీ జగన్ గత ఐదేళ్ళలో తనకు నచ్చిందే చేసుకుంటూ వెళ్లారు. వాస్తును అసలు పట్టించుకోలేదు. అది అతని వ్యక్తిగత నిర్ణయం కావచ్చు. అయితే ఐదేళ్ల తర్వాత జగన్‌లో అధికారం కోల్పోతున్నామనే భయం మొదలైందట. దీంతో ఆయన తాడేపల్లిలో నివాసం ఉంటున్న ఇంటి వాస్తును మార్చేపనిలో పడినట్లు తెలుస్తోంది. ప్రజల్లో వైసీపీపై ఉన్న వ్యతిరేకతను తనవైపు తిప్పుకోవడానికి వేసిన వ్యూహాలన్నీ సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో జగన్‌లో ఓటమి భయం రోజురోజుకు పెరుగుతందట. అసలు వైసీపీ గ్రాఫ్ ఇంతగా తగ్గిపోవడానికి తన ఇంటి వాస్తు కూడా కారణం కావొచ్చని భావించిన సీఎం జగన్ తన ఇంటి వాస్తును మార్చే పనులకు రెండు రోజుల క్రితం శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
AP Elections: ఈ ఐదేళ్లలో ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా?..వైసీపీ నేతలను ప్రశ్నించిన సుజనా
అధికారం కోసమేనా..!
వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎంత చేసినా తమ పార్టీకి అనుకూల వాతావరణం లేకపోవడంతో అసలు సమస్య ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు వాస్తు, జ్యోతిష్య పండితులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఓ వాస్తు పండితుడిని తాడేపల్లి ప్యాలెస్‌కు తీసుకువచ్చి చూపించగా.. ఆ పండితుడు కొన్ని మార్పులు చేయాలని సూచించినట్లు సమాచారం. సీఎం జగన్ నివసిస్తున్న ఇంట్లో వాస్తుపరంగా కొన్ని మార్పులు చేస్తే పరిస్థితిలో కొంచెం మార్పు ఉండవచ్చని చెప్పారట. దీంతో సీఎం జగన్ వాస్తు పండితుల్ని పిలిపించగా.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం, ఇంటి చుట్టూ ఎత్తుగా ప్రహరీలా నిర్మించిన ఇనుప కట్టడాన్ని ఒక మూల తొలగించాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం క్యాంపు కార్యాలయంలో మరమ్మతు పనులు మే1వ తేదీ నుంచి ప్రారంభించినట్లు సీఎం క్యాంప్ కార్యలయం వర్గాలు తెలిపాయి.
తాడేపల్లిలో సీఎం ఇల్లు, క్యాంప్ కార్యాలయ భవనాలు పక్కపక్కనే ఉంటాయి. వాటికి సమీపంలో ఉన్న ప్రైవేటు వ్యక్తులకు చెందిన విల్లాలు, అపార్ట్‌మెంట్ల లోంచి చూస్తే సీఎం ఇంటి వరండాలో తిరిగేవారు స్పష్టంగా కనిపిస్తారనే ఉద్దేశంతో, చాలాకాలం క్రితం బలమైన, ఎత్తయిన ఇనుప కట్టడాన్ని ప్రహరీలా నిర్మించారు. ఇప్పుడు వాస్తు పండితుల సూచనల మేరకు ఓ మూలన ప్రహరీని తొలగిస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి వెల్డర్లు, కార్మికులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఆ పనులను సీఎం స్వయంగా పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. ఐదేళ్ల పాటు తాను చెప్పిందే చెల్లుతుంది.. తనను చూసే ఓట్లు వేస్తారనుకున్న జగన్.. సడన్‌గా వాస్తు పండితులను సంప్రదించి.. తన నివాసంలోని వాస్తును సరిచేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం జగన్‌కు ఈ వాస్తు మార్పు కలిసొస్తుందా లేదా అనేది జూన్4న తేలనుంది.
AP Elections: చీఫ్ సెక్రటరీ, డీజీపీ జగన్ బాటలో నడుస్తున్నారు: కనకమేడల రవీంద్రకుమార్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News And Telugu News
Updated Date - May 04 , 2024 | 12:44 PM