ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ap Election Survey :లోకమంతా ఒకవైపు.. జగన్‌ మరోవైపు!

ABN, Publish Date - Jun 02 , 2024 | 05:57 AM

లోకమంతా ఒకవైపు.. సీఎం జగన్‌ మరోవైపు అన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఎగ్జిట్‌పోల్స్‌లో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని పీపుల్స్‌ పల్స్‌, రైజ్‌ తదితర సంస్థలు పేర్కొన్నాయి. ప్రజల్లో జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశాయి. ఊరూపేరూ లేని అనామక సంస్థలు వైసీపీయే అధికారంలోనికి వస్తుందంటూ ఇచ్చిన ఫలితాలను జగన్‌కు చెందిన చెందిన నీలి, కూలి మీడియాలో ప్రముఖంగా ప్రచారం చేసుకుని ప్రభుత్వ పెద్దలు సంతృప్తి చెందుతున్నారు. ఈ సంస్థలూ జగన్‌ చెప్పినట్లుగా 151 స్థానాలకు మించి వస్తాయని పేర్కొనలేదు

CM YS Jagan

అనామక సంస్థల సర్వేలతో సంతృప్తి!!

వైసీపీయే గెలవబోతోందని

నీలి, కూలి మీడియాలో ప్రచారం

వైసీపీ శ్రేణుల్లో కనిపించని జోష్‌


అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): లోకమంతా ఒకవైపు.. సీఎం జగన్‌ మరోవైపు అన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఎగ్జిట్‌పోల్స్‌లో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని పీపుల్స్‌ పల్స్‌, రైజ్‌ తదితర సంస్థలు పేర్కొన్నాయి. ప్రజల్లో జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశాయి. కానీ ఊరూపేరూ లేని అనామక సంస్థలు వైసీపీయే అధికారంలోనికి వస్తుందంటూ ఇచ్చిన ఫలితాలను జగన్‌కు చెందిన చెందిన నీలి, కూలి మీడియాలో ప్రముఖంగా ప్రచారం చేసుకుని ప్రభుత్వ పెద్దలు సంతృప్తి చెందుతున్నారు.


నయం.. ఇంక..?

ఈ సంస్థలూ జగన్‌ చెప్పినట్లుగా 151 స్థానాలకు మించి వస్తాయని పేర్కొనలేదు. వైసీపీ, టీడీపీ కూటమి మధ్య ఓట్లతేడా స్వల్పంగానే ఉంటుందని తెలిపాయి. అసెంబ్లీ స్థానాల్లో కొద్దిపాటి ఆధిక్యం చూపినా.. లోక్‌సభ స్థానాలకు వచ్చేసరికి దాదాపు ఉభయపక్షాలకు సమాన ఫలితాలు వస్తాయని తెలిపాయి.


బ్లూ మీడియా మాత్రం..

అయినా.. నీలి, కూలి మీడియా మాత్రం ఫ్యాన్‌ విజయం ఖాయమైపోయిందని ఊదరగొడుతున్నాయి. మరో 48గంటల్లో ఓట్ల లెక్కింపు, అసలైన ఫలితాలు వెలువడనున్నాయి. అప్పుడు ఎలాంటి ఊహాగానాలకు ఆస్కారం ఉండదు. ఈలోగా ప్రజల్లో ఎన్నికల ఫలితాలపై ఆయోమయం సృష్టించడం ద్వారా కొద్ది గంటలైనా కేడర్‌ను సంతోషపరిచేందుకు, పోలింగ్‌ ఏజెంట్లు చేజారకుండా కాపాడుకునేందుకు ప్రభుత్వ ముఖ్యులు ఈ విన్యాసాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి గత నెల 13నే నాలుగో విడతలో రాష్ట్రంలో పోలింగ్‌ ముగిసింది.


82 శాతం ఓటింగ్

భారీస్థాయిలో 82 శాతం ఓటింగ్‌ జరగడంతో.. ఎవరెటు మొగ్గారో తెలియక మంత్రుల్లో అయోమయం నెలకొంది. పైగా మూడో తేదీ(సోమవారం) నాటికి చాంబర్లు ఖాళీ చేయాలంటూ సాధారణ పరిపాలనా శాఖ నుంచి ఆదేశాలు రావడంతో వారిలో నిస్తేజం ఆవహించింది. ఇదే సందర్భంలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లపై ఎంత ఆశలు పెట్టుకున్నా..


వ్యతిరేకంగా ప్రజానాడి

ప్రజానాడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందన్న సమాచారం వైసీపీ అభ్యర్థులను గందరగోళంలోకి నెట్టింది. మళ్లీ అధికారంలోనికి వస్తున్నామని .. తొమ్మిదో తేదీన విశాఖ వేదికగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని సీఎం జగన్మోహన్‌రెడ్డి స్వయంగా ప్రకటిస్తున్నా.. వారిలో విశ్వాసం కలుగడం లేదు. ఇప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చూశాక వారిలో ఏ మూలనో ఉన్న ఆశలు చెదిరిపోయాయి.

Updated Date - Jun 02 , 2024 | 07:32 AM

Advertising
Advertising