ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: వృద్ధులపై వైఎస్ జగన్ కుట్ర.. ఇదిగో సాక్ష్యం!

ABN, Publish Date - Apr 02 , 2024 | 02:03 PM

ఐదేళ్ల వైసీపీ పాలనపై ఉన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం వైఎస్ జగన్ విశ్వప్రయత్నాలు చేస్తు న్నారట. వేసిన ప్రతి ప్లాన్.. రివర్స్ కొడుతుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదట. పెన్షన్ల విషయంలో రాద్ధాంతం సృష్టించి.. విపక్షాలపై విషం జిమ్మాలనే జగన్ ప్రయత్నం ఫలించ లేదట. అయినప్పటికీ.. దీనిని ఏదో రకంగా ఎన్నికల వరకు సాగదీయాలని వ్యూహం రూపొందించగా.. అది బెడిసికొట్టినట్లు తెలుస్తోంది.

ఐదేళ్ల వైసీపీ పాలనపై ఉన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం వైఎస్ జగన్ (YS JAGAN) విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. వేసిన ప్రతి ప్లాన్.. రివర్స్ కొడుతుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదట. పెన్షన్ల విషయంలో రాద్ధాంతం సృష్టించి.. విపక్షాలపై విషం జిమ్మాలనే జగన్ ప్రయత్నం ఫలించలేదట. అయినప్పటికీ.. దీనిని ఏదో రకంగా ఎన్నికల వరకు సాగదీయాలని వ్యూహం రూపొందించగా.. అది బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. సామాజిక పెన్షన్లు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఇవ్వడం లేదు. దేశం మొత్తం పెన్షన్లు పంపిణీ చేస్తారు. అలాగే ఎన్నికలు ఏపీలో మాత్రమే జరగడం లేదు.. ఇండియాలోచాలా లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఏపీలో మాత్రమే 3వేల రూపాయిల పెన్షన్ ఇవ్వడం లేదు. హర్యానాలోనూ వృద్ధాప్య పెన్షన్ 3వేలు ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులే ఫించన్లు అందజేస్తున్నారు. ఎన్నికలున్నా.. లేకపోయినా.. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు అందిస్తే బాధ్యత ఉంటుందనే ఉద్దేశంతో అలా చేస్తారు.

AP Elections: ఎన్నికల ముందు వైసీపీకి మరో బిగ్ షాక్..

ఒక్క ఏపీలోనే కాదుగా..!

ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఎన్నికల విధులు నిర్వర్తించాలి. ఇతరులు ఈ విధుల్లో భాగస్వాములు అయ్యే అవకాశం ఉండదు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే పరిపాలన ఉంటుంది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. అలా పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించాలని వాలంటీర్లతో వద్దని ఆదేశించింది. ఎన్నికల సంఘం ఆదేశాలను తప్పుగా ప్రచారం చేస్తూ.. పెన్షన్లు ఆపేయాలని విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయంటూ వైసీపీ నాయకులు ప్రచారం మొదలుపెట్టారు. చివరికి పెన్షన్లు ఎవరూ ఆపమని చెప్పలేదని.. జగన్ ప్రభుత్వానికి ఇవ్వడం చేతకాక.. తప్పించుకునేందుకు, వృద్ధులకు పెన్షన్ లేట్‌గా ఇచ్చి.. ఆలస్యానికి విపక్షాలే కారణమనే ప్రచారం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఓ కుట్రకు వైసీపీ తెరలేపినట్లు తెలుస్తోంది.

రాజకీయ కుట్రేనా..?

వాస్తవానికి గతంలో ఒకసారి గ్రామ, వార్డు కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేసిన సందర్భాలు ఉన్నాయి. గ్రామ, వార్డు కార్యదర్శలు పెన్షన్లు పంపిణీ చేసినా ఒకటి నుంచి రెండు రోజుల్లో 90 శాతం పెన్షన్లు అందజేయవచ్చు. కాని పెన్షన్లు సకాలంలో ఇవ్వకూడదనే ఒక కుట్రతోనే వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లు అర్థమవుతోంది. ఒక సచివాలయంలో కనీసం ఆరుగురు నుంచి పది మంది సిబ్బంది ఉంటారు. సచివాలయం పరిధిలో ఐదు నుంచి పన్నెండు క్లస్టర్‌లు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక కస్టర్ లేదా రెండు కస్టర్లలో పెన్షన్ డబ్బులు ఇంటింటికి అందజేస్తే రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తవుతుంది. సచివాలయ వ్యవస్థ ఉన్న తర్వాత కూడా వారం రోజులు పడుతుందని అధికారులు చెప్పడం వెనుక రాజకీయ కుట్ర ఉందనే ప్రచారం జరుగుతోంది.

ఇంత భక్తి ఎందుకో!

వాస్తవానికి ఎన్నికల సంఘం కింద అధికారులు పని చేయాల్సి ఉంటుంది. అయినా కొంతమంది అధికారులు మాత్రం ఇంకా వైసీపీ భక్తులుగానే పని చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఎందరో ప్రజాస్వామ్యవాదులు హెచ్చరిస్తున్నా అధికారుల తీరు మారడం లేదు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నా.. అధికారులు మాత్రం వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేయాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదు. కొంతమంది రాజకీయ నాయకులకు ప్రయోజనం చేకూర్చడం కోసం అధికారులు ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకుని.. ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించడం ద్వారా.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజాస్వామ్య వాదులు చెబుతున్న మాట. ఇప్పటికైనా అధికారుల తీరు మారుతుందో లేదో చూడాలి మరి.

YS Sunitha.. వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలి: వైఎస్‌ సునీత

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 02 , 2024 | 02:07 PM

Advertising
Advertising