ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: సొంత పార్టీ నేతలే నాపై కుట్ర చేశారు.. ఎలిజా కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Mar 24 , 2024 | 05:54 PM

వైఎస్సార్‌సీపీ చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా (Vunnamatla Eliza) ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో చేరిన తర్వాత వైసీపీ, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీకి రాజీనామా చేశా.. తన రాజీనామా లేఖను అధినేత జగన్‌ రెడ్డికి పంపించానని తెలిపారు. వైఎస్ షర్మిలా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరానని అన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో స్థానిక రాజకీయాలు తట్టుకోలేక పోయానని అన్నారు.

అమరావతి: వైఎస్సార్‌సీపీ చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా (Vunnamatla Eliza) ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో చేరిన తర్వాత వైసీపీ, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీకి రాజీనామా చేశా.. తన రాజీనామా లేఖను అధినేత జగన్‌ రెడ్డికి పంపించానని తెలిపారు. వైఎస్ షర్మిలా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరానని అన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో స్థానిక రాజకీయాలు తట్టుకోలేక పోయానని అన్నారు. సొంత పార్టీ నేతలే తనపై కుట్ర పన్నారని చెప్పారు. తనను వైసీపీ నేతలు ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవలేదన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండానే రీజనల్ కో ఆర్డినేటర్ సమావేశాలు పెట్టారని అన్నారు. ఈ విషయాన్ని చాలాసార్లు వైసీపీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.జగన్ నుంచి సరైన స్పందన లేదన్నారు. తన అవసరం పార్టీకి లేదేమోననిపించిందని అందుకే వైసీపీని వీడానని తెలిపారు.

AP Politics: ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతిస్తాం... మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు

సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకు తెలియకుండానే కార్యక్రమాలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తన పేరును కూడా శిలాఫలకాల మీద లేకుండా తీసేశారని చెప్పారు. అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేదన్నారు. తన పార్టీ అనుకొని పని చేస్తే మోసం చేశారని మండిపడ్డారు. ఈ దేశానికి , ఏపీకి కాంగ్రెస్ చాలా అవసరమని తెలిపారు. కాంగ్రెస్ ఒక్కటే ఏ మతానికి, కులానికి బేస్ కాదన్నారు. ఈ పార్టీలో కష్టపడతానని చెప్పారు. కచ్చితంగా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీలో ఉన్న అసమ్మతి నేతలు చాలా మంది కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయన్నారు.తనను బయటకు పంపిన వైసీపీ నేతలు ఎవరో అందరికీ తెలుసునని ఎమ్మెల్యే ఎలిజా చెప్పారు.

ఇవి కూడా చదవండి

TDP: ప్రజాగళం షెడ్యూల్ విడుదల.. 4 రోజులపాటు పర్యటనలో బిజీ కానున్న చంద్రబాబు

Pawan Kalyan: చేనేత కార్మికుడి కుటుంబం ఆత్మహత్య పట్ల పలు అనుమానాలు

TTD: ధర్మారెడ్డిపై వైఎస్‌ జగన్‌కు ఎందుకింత ప్రేమ.. ఓహో అసలు సినిమా ఇదేనా..?

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 05:54 PM

Advertising
Advertising