Ex-Minister Kakaṇi Govardhan : సీఐ ఖాకీ చొక్కా వలుస్తాం!
ABN, Publish Date - Dec 25 , 2024 | 04:58 AM
‘వైసీపీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటశేషయ్యపై సీఐ సుబ్బారావు, ఆర్‌ఐ రవి తప్పుడు కేసు పెట్టారు.
మాజీ మంత్రి కాకాణి చిందులు
నెల్లూరు, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటశేషయ్యపై సీఐ సుబ్బారావు, ఆర్‌ఐ రవి తప్పుడు కేసు పెట్టారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి రాకూడదని వీరిద్దరూ ప్రతినిత్యం దేవుడికి దండం పెట్టుకోవాలి. మేం అధికారంలోకి వచ్చాక సీఐ ఒంటి మీద ఉన్న ఖాకీ దుస్తులు వలిచి శాశ్వతంగా ఉద్యోగం తొలగించేలా చర్యలు తీసుకుంటాం’ అంటూ మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి చిందులు తొక్కారు. నేడు అధికారులు చేస్తున్న పాపాలు వారికి శాపాలుగా మారతాయని హెచ్చరించారు. ఘటనా స్థలానికి ఆర్‌ఐ రాకుండానే రిపోర్టు ఇచ్చారని, ఆయన రాలేదనడానికి తానే ప్రత్యక్ష సాక్షినని చెప్పారు. కాగా, ఉద్యోగం ఆశ చూపి ఓ మహిళపై పలుమార్లు లైంగికదాడి కేసులో కాకాణి ముఖ్య అనుచరుడు మందల వెంకటశేషయ్యకు న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్ విధించింది.
Updated Date - Dec 25 , 2024 | 04:59 AM