Devineni Uma: ప్రచారానికి వచ్చి టీడీపీ కార్యకర్తలపై దాడి అమానుషం
ABN, Publish Date - Apr 03 , 2024 | 03:04 PM
Andhrapradesh: నందిగామలో వైసీపీ దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఆంధ్ర హస్పటల్‌లో మాజీ మంత్రి దేవినేని ఉమా పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నందిగామలో వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రోద్భలంతోనే ప్రజలు, టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు. వసూల్ బ్రదర్స్ దుర్మార్గాలను ఎదిరించి తంగిరాల సౌమ్య వీరోచితంగా పోరాడుతున్నారన్నారు.
ఎన్టీఆర్ జిల్లా, ఏప్రిల్ 3: నందిగామలో వైసీపీ (YSRCP) దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఆంధ్ర హస్పటల్‌లో మాజీ మంత్రి దేవినేని ఉమా (Former Minister Devineni Uma) పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నందిగామలో వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రోద్భలంతోనే ప్రజలు, టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు. వసూల్ బ్రదర్స్ దుర్మార్గాలను ఎదిరించి తంగిరాల సౌమ్య (Tangirala Soumya) వీరోచితంగా పోరాడుతున్నారన్నారు. నల్లాని కిషోర్, నరసింహారావుల ఇంటికి మొండితోక జగన్మోహన్‌రావు ప్రచారానికి వచ్చి.. వారిపై వైసీపీ నాయకులు రాడ్లతో ఇటుకలు, కర్రలతో దాడి చేయడం అమానుషమని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంలో కూడా కొంతమంది అధికారులను అడ్డుపెట్టుకొని ఇటువంటి దాడులు చేయడం దుర్మార్గమన్నారు. మొండితోక బ్రదర్స్ దాడులు దౌర్జన్యాలతో భయాందోళన సృష్టిస్తున్నారన్నారు.
ప్రజా రాజధాని అమరావతిని దెబ్బతీయడం వలన భూముల విలువ కోల్పోయి, ఉపాధి దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రశ్నించాలని ప్రయత్నం చేస్తేనే తట్టుకోలేక సమాధానం చెప్పలేక గుండా గిరి దాడులు చేసి తిరిగి వాళ్ళ పైనే తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగామ డీఎస్పీ సంబంధిత అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎవరైతే దాడులు చేశారో వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తూ తూ మంత్రం కేసులు పెట్టి మళ్లీ ఇటువంటి అరాచక శక్తులను ప్రోత్సహిస్తే ఇంకా దాడులు పెరిగే అవకాశం ఉందన్నారు. రాడ్లు, ఇటుక, రాళ్లు, కర్రలతో కొట్టిన అన్ని దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఉన్నాయన్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ, నందిగామ డీఎస్పీ, సంబంధిత ఎస్సై, సీఐ స్పందించాలన్నారు. ఇటువంటి దౌర్జన్యకర సంఘటనలు భవిష్యత్తులో మళ్లీ మళ్లీ జరగకుండా ఆపాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉందని అన్నారు. సంఘటనపై వెంటనే చర్యలు తీసుకుని నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమం తీసుకుంటుందని తెలియజేస్తున్నట్లు దేవినేని ఉమా వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
AP Elections: జగన్‌కు ఓటమి భయం.. పెన్షన్ల పేరిట నీచ రాజకీయం..
AP Elections: రాజీనామా తర్వాత వలంటీర్లు ఏం చేస్తున్నారో తెలిస్తే..?
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Apr 03 , 2024 | 03:05 PM