ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: ఏపీ సీఎం జగన్‌ను ఏకిపారేసిన గోనె ప్రకాష్ రావు

ABN, First Publish Date - 2024-02-07T12:21:26+05:30

Telangana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు విమర్శలు గుప్పించారు. జగన్ పిరికి పంద అంటూ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వలన జగన్ ముగినిపోతున్నారని సంచలన కామెంట్స్ చేశారు.

హైదరాబాద్/అమరావతి, ఫిబ్రవరి 7: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రెడ్డిపై (AP CM YS Jaganmohan reddy) మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Former MLA gone Prakash Rao) విమర్శలు గుప్పించారు. జగన్ పిరికిపంద అంటూ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వలన జగన్ ముగినిపోతున్నారని సంచలన కామెంట్స్ చేశారు. షర్మిలపై (Congress Leader YS Sharmila) చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. సజ్జల లాంటి దరిద్రుడి సలహాలతో జగన్‌కు తీవ్ర నష్టం జరగబోతోందన్నారు. టీడీపీ, జనసేన కూటమికి ఏపీలో 151 సీట్లు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. ఎన్నికల తర్వాత జగన్ శాసనసభకు కూడా రాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆ దేవుడు కూడా క్షమించడు...

బీజేపీతో పొత్తు వలన.. టీడీపీ, జనసేన కూటమికి బలం పెరుగుతోందన్నారు. చంద్రబాబు (TDP Chief Chandrababu) చరిత్ర తెలియకుండా జగన్ మట్లాడటం సరైంది కాదన్నారు. 1978లో చంద్రబాబు ఎమ్మెల్యే అయినప్పుడు.. జగన్ డైపర్లు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంత్రులు రోజా, విడదల రజనీకి కూడా జగన్ టికెట్ ఇవ్వరన్నారు. కొత్త ఇంచార్జ్‌ల్లో 35 మంది వరకు జగన్ బీఫాం ఇవ్వరన్నారు. తల్లి, చెల్లి పట్ల జగన్ వ్యవహరిస్తోన్న తీరును.. దేవుడు కూడా క్షమించడన్నారు.


తండ్రిని చంపిన వారితోనే....

2019 ఎన్నికల్లో కూడా హైదరాబాద్ నుంచే జగన్ ప్రచారం చేశారన్నారు. ఎన్‌ఆర్ఐ అర్థం ఏంటో కూడా జగన్‌కు తెలియదన్నారు. హత్యలు కాదు.. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయనటానికి జగనే ఉదాహరణ అన్నారు. ఏపీలో వైసీపీ చిత్తుగా ఓడిపోతుందని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. షర్మిల వలన కాదు.‌. జగన్‌ను నమ్ముకున్న తెలంగాణ నేతలు రోడ్డున పడ్డారన్నారు. జగన్‌ను నమ్ముకున్న కొండా సురేఖ రాజకీయంగా నష్టపోయిందని తెలిపారు. జగన్‌ను వదిలేయటం వలనే ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప, పువ్వాడ అజయ్, పుట్ట మధు, బాజిరెడ్డి, సంజీవరావులు రాజకీయంగా కుదురుకున్నారన్నారు. సోనియా గాంధీ (Sonia Gandhi) కాళ్ళు పట్టుకుని జైలు నుంచి జగన్ బయటకు వచ్చారన్నారు. రిలయన్స్‌పై దాడులు చేసి అదే రిలయన్స్ వ్యక్తి పరిమళ్‌కు రాజ్యసభ ఇచ్చారన్నారు. తండ్రిని చంపించిన వారితో జగన్ డబ్బుల కోసం ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. స్వార్థం కోసం దగ్గర బంధువు సునీల్ ఎవరో తెలియదన్న వ్యక్తి జగన్ అంటూ గోనె ప్రకాష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - 2024-02-07T16:58:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising