ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gorantla : జగనన్న కాలనీల్లో భారీ కుంభకోణం

ABN, Publish Date - Mar 14 , 2024 | 10:00 PM

జగనన్న కాలనీల్లో భారీ కుంభకోణం జరిగిందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Butchaiah Chowdary) అన్నారు. గురువారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...ముఖ్యమంత్రికే సిగ్గులేకుండా పూర్తికాని పనులను ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రారంభింస్తున్నారని మండిపడ్డారు.

రాజమండ్రి: జగనన్న కాలనీల్లో భారీ కుంభకోణం జరిగిందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Butchaiah Chowdary) అన్నారు. గురువారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...ముఖ్యమంత్రికే సిగ్గులేకుండా పూర్తికాని పనులను ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రారంభింస్తున్నారని మండిపడ్డారు. బూరుగుపూడిలో 500 ఎకరాల భూమిని తక్కువ ధరకు కొనుగోలు చేసి కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. లేని ఇళ్ల స్థలాలుకు పట్టాలు పంపిణీ చేస్తున్నారని.. చెల్లుబాటు కాని ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు.రాజమండ్రిలో రెండు లక్షల చీరలు పంపిణీ చేసి వైసీపీకి ఓట్లు వేయమని ప్రజలకు చెబుతున్నారని అన్నారు.

ప్రజలంతా జగన్ పార్టీని ఛీ కొడుతున్నారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ను ఎందుకు బదిలీ చేయటం లేదని ప్రశ్నించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కలెక్టరేట్ అధికారులు పాల్పడుతున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు ఇచ్చే తాయిలాలు తీసుకోవాలని... ఓటు మాత్రం వైసీపీకి వేయవద్దని అన్నారు. ఏడోసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Mar 14 , 2024 | 10:00 PM

Advertising
Advertising