ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bonda Uma: ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం మితిమీరిన జోక్యం..

ABN, Publish Date - May 06 , 2024 | 11:51 AM

ఎన్నికల ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం మితి మీరిన జోక్యం చేసుకుంటోందని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. సజ్జల వంటి సలహాదారులు ఇష్టం వచ్చిన విధంగా దూషిస్తున్నారన్నారు. మా వాళ్లపై వైసీపీ రౌడీ మూకలు దాడులు చేస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల వారిని కొట్టినా నామ మాత్రపు సెక్షన్‌లు పెడుతున్నారన్నారు. నార్త్ ఏసీపీ ప్రసాద్, నున్న సీఐ దుర్గా ప్రసాద్‌లకు వెల్లంపల్లి పోస్టింగ్ వేయించారని బోండా ఉమ అన్నారు.

విజయవాడ: ఎన్నికల ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం మితి మీరిన జోక్యం చేసుకుంటోందని టీడీపీ నేత బోండా ఉమ (Bonda Uma) అన్నారు. సజ్జల వంటి సలహాదారులు ఇష్టం వచ్చిన విధంగా దూషిస్తున్నారన్నారు. మా వాళ్లపై వైసీపీ రౌడీ మూకలు దాడులు చేస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల వారిని కొట్టినా నామ మాత్రపు సెక్షన్‌లు పెడుతున్నారన్నారు. నార్త్ ఏసీపీ ప్రసాద్, నున్న సీఐ దుర్గా ప్రసాద్‌లకు వెల్లంపల్లి పోస్టింగ్ వేయించారని బోండా ఉమ అన్నారు. మా వాళ్లను కొట్టినా వారు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశామని బోండా ఉమ తెలిపారు. సీపీ, ఇంటిలిజెన్స్ డీజీ, డీజీపీలను కేంద్ర ఎన్నికల సంఘం తప్పించిందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం డమ్మీగా పని చేస్తోందని బోండా ఉమ అన్నారు. కొంతమంది పోలీసులు వైపీపీకి తొత్తులుగా పని చేస్తున్నారన్నారు.

Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో వెలుగు చూస్తున్న భూవివాదాలు


ఆధారాలతో సహా ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇంతవరకూ వీటి చర్యలు ఎందుకు తీసుకోవడం‌ లేదని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటో మాకు తెలియడం‌ లేదన్నారు. పోలీసులు ‌స్వయంగా చెబుతున్నారని.. వైసీపీ వాళ్లకే పని చేస్తామన్నారు. నిన్న ఒక సర్వేయర్ పోస్టల్ బ్యాలెట్ వేయలేదని‌ వైసీపీ రౌడీమూకలు దాడి చేశారన్నారు. హత్యాయత్నం చేస్తే... పెట్టి కేసు కింద సెక్షన్‌లు కట్టారన్నారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్నా పోలీసులు అక్కడకు‌ వెళ్లలేదన్నారు. యాభై మంది కొడుతున్నారని తాను స్వయంగా ఫోన్ చేశానని బోండా ఉమ తెలిపారు. ఆ తరువాత అంతా అయ్యాక అక్కడకు పోలీసులు వెళ్లారన్నారు. కార్పొరేటర్ భర్త దాడి‌ చేస్తే... అతనితో కూడా ఫిర్యాదు తీసుకున్నారన్నారని బోండా ఉమ తెలిపారు.

YS Sharmila: జగన్‌ను పైసా సాయం అడగలే, నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెబుతా..!!


అంటే బాధితుడిపై కూడా కేసులు పెట్టేలా‌ పోలీసులు ప్రోత్సహిస్తున్నారన్నారు. గణేష్, రవి, నాగరాజులను అరెస్టు చేయకుండా వదిలేశారన్నారు. మళ్లీ దెబ్బలు తిన్న సర్వేయర్‌ను కేసు వెనక్కి తీసుకోమని‌ బెదిరిస్తున్నారన్నారు. ఇటువంటి ఏసీపీ, సీఐలపై ఎందుకు‌ చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి మళ్లీ ఆధారాలతో ఫిర్యాదు చేస్తున్నామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తరహాలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎందుకు స్పందించదని ప్రశ్నించారు. అధికార పార్టీకి స్లీపింగ్ మోడ్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం పని‌ చేస్తోందన్నారు. గులకరాయి దాడి కేసులో 307 సెక్షన్ కింద కేసు కట్టారని.. ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఇంటికెళ్లి కొడితే నామమాత్రపు సెక్షన్ లా కేసు నమోదు చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బోండా ఉమ అన్నారు.

ఇవి కూడా చదవండి...

TS Lok Sabha Polls: జహీరాబాద్‌లో బీసీల బాద్‌షా ఎవరో..?

H D Revanna: కిడ్నాప్, లైంగిక ఆరోపణల కేసులో అరెస్టైన హెచ్‌డీ రేవణ్ణకు మరో షాక్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 06 , 2024 | 12:10 PM

Advertising
Advertising