AP NEWS: ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌పై కేసు నమోదు
ABN, Publish Date - Sep 21 , 2024 | 07:22 PM
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. ఆదిత్య కన్స్‌ట్రాక్షన్స్ కంపెనీలో సిట్ పోలీసులు ఇవాళ(శనివారం) తనిఖీలు చేశారు. ఆదిత్య కన్స్‌ట్రాక్షన్స్ కంపెనీ తనను మోసం చేసిందంటూ వాకాడ తిరుమలరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదిత్య కన్స్‌ట్రాక్షన్స్ కంపెనీపై సీసీఎస్‌లో కేసు నమోదైంది.
అమరావతి: ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. ఆదిత్య కన్స్‌ట్రాక్షన్స్ కంపెనీలో సిట్ పోలీసులు ఇవాళ(శనివారం) తనిఖీలు చేశారు. ఆదిత్య కన్స్‌ట్రాక్షన్స్ కంపెనీ తనను మోసం చేసిందంటూ వాకాడ తిరుమలరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదిత్య కన్స్‌ట్రాక్షన్స్ కంపెనీపై సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిగా ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేశారు. ఆరుగురిని నిందితులుగా పోలీసులు చేర్చారు.
ALSO Read: Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..
ఏ3గా తోట చంద్రశేఖర్ పేరు నమోదు చేశారు. 2021లో ఆదిత్య కన్స్‌ట్రాక్షన్స్, సాయి తిరుమల కన్స్‌ట్రాక్షన్స్ ఒప్పందం చేసుకుంది. 220 ప్లాట్స్ డెవలప్ చేసి ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. సాయి తిరుమల కన్స్ట్రక్షన్స్ 90% నిర్మాణాలు పూర్తి చేసింది. నిర్మాణాల కోసం సాయి తిరుమల కన్స్‌ట్రాక్షన్స్ రూ. 50 కోట్లు సొంత పెట్టుబడి పెట్టుకుంది.
ALSO Read: Srisaila Devasthanam: వైసీపీ హయాంలో అంతా మాయ..
బిల్లులు చెల్లించకుండా సాయి తిరుమల కన్స్‌ట్రాక్షన్స్ ప్రతినిధులను ఆదిత్య కన్స్‌ట్రాక్షన్స్ వేధిస్తుంది. బిల్స్ కోసం వెళ్తే బౌన్సర్లతో ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ నిర్వాహకులు దాడులు చేయించారు. ఓనర్‌ను ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ బెదిరించింది. 29 కోట్ల రూపాయలు మోసం చేశారంటూ సీసీఎస్ పోలీసులను వాకాడ తిరుమలరావు ఆశ్రయించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Visakha: రెచ్చిపోయిన కామాంధుడు.. భీమిలిలో మరో దారుణ ఘటన..
AP Politics: జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. పవన్ సమక్షంలో చేరికకు ముహుర్తం ఫిక్స్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News Click Here
Updated Date - Sep 21 , 2024 | 07:31 PM