ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: ఆ జిల్లాలకు కోటి చొప్పున నిధులు విడుదల.. ఎందుకంటే..

ABN, Publish Date - Oct 14 , 2024 | 09:36 PM

ఇటీవల కురిసిన వర్షాలకు బుడమేరు పొంగి వరదనీరు విజయవాడ నగరాన్ని ముంచెత్తిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకుంటున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రానికి తుపాను (Cyclone) హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం (AP Govt) అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర నిధులు విడుదల చేసింది. ఒక్కో జిల్లాకు కోటి రూపాయల చొప్పున మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలకు కోటి రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత సహా పలువురు మంత్రులు అధికారులతో సమీక్షలు నిర్వహించారు.


ఇటీవల కురిసిన వర్షాలకు బుడమేరు పొంగి వరదనీరు విజయవాడ నగరాన్ని ముంచెత్తిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా తుపాను ప్రభావిత జిల్లాలకు ముందస్తు చర్యల నిమిత్తం కోటి రూపాయల చొప్పున సీఎం చంద్రబాబు నిధులు విడుదల చేశారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు, రక్షిత తాగునీరు, ఆహారం, హెల్త్ క్యాంపులు, శానిటేషన్ కోసం నిధులను వినియోగించనున్నారు


వరద ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే రహదారులు భవనాలు, మున్సిపల్, పంచాయతీరాజ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహకారంతో రహదారులపై పడిపోయిన చెట్లు, స్తంభాలు తొలగించాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Minister Kollu Ravindra: ఏపీలో పారదర్శకంగా మద్యం పాలసీ: మంత్రి కొల్లు రవీంద్ర..

Pawan Kalyan: పరిపాలన, రాజకీయాలు రెండూ వేరు.. వైసీపీపై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్

Raghu Rama Case: ఎమ్మెల్యే రఘురామ కేసులో ట్విస్ట్..

Read Latest AP News and Telugu News

Updated Date - Oct 14 , 2024 | 09:36 PM