ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Cabinet: నిరుద్యోగులకు శుభవార్త..

ABN, Publish Date - Aug 28 , 2024 | 11:16 AM

ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి ఏపీ క్యాబినెట్ పచ్చజెండా ఊపింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సర్కార్(AP Govt) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి ఏపీ క్యాబినెట్(AP Cabinet) పచ్చజెండా ఊపింది. అలాగే పౌరసరఫరాల శాఖకు సంబంధించి 2,771 కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇవాళ(బుధవారం) ఉదయం 11గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటైన క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.


ఏపీ క్యాబినెట్ సమావేశంలో మరికొన్ని కీలక అంశాలపై చర్చ జరిగింది. గత ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఒక నిరుపయోగమైన విధానంగా మంత్రులు వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధానం సరికాదని, అందుకే రద్దు చేయాలంటూ తీర్మానించారు. అలాగే సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహణపై క్యాబినెట్‌లో చర్చ సాగింది. 2014లో చివరిసారిగా సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరిగాయి.


మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫొటోలతో కూడిన పాసు పుస్తకాల స్థానంలో కొత్తగా 21లక్షల పుస్తకాలను రైతులకు ఇచ్చేందుకు క్యాబినెట్ నిర్ణయించింది. అలాగే గత ప్రభుత్వం 77లక్షల సర్వేరాళ్లపై ముద్రించిన ఫొటోలను చెరిపి వాటిని వినియోగించుకునే విషయంపైనా చర్చసాగింది. కొత్తగా 2,774రేషన్ షాపుల ఏర్పాటుపై క్యాబినెట్ ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి. విజన్ 2047 రూపకల్పనపై పెద్దఎత్తున చర్చ జరిగింది. ఏపీలో కొత్త మద్యం పాలసీ తెచ్చే అంశంపైనా క్యాబినెట్ ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఉచిత ఇసుక విధానాన్ని సులభతరం చేసేందుకు తీసుకునే నిర్ణయాలపైనా క్యాబినెట్‌లో మంత్రులు, ముఖ్యమంత్రి చర్చించారు.

Updated Date - Aug 28 , 2024 | 01:28 PM

Advertising
Advertising
<