ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP GOVT: టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN, Publish Date - Dec 17 , 2024 | 02:17 PM

రాష్ట్ర టూరిజం అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు.ఆలయాలకు వచ్చే భక్తులు వసతులు లేక కేవలం దర్శనాలకే పరిమితం అవుతున్నారన్నారు. ప్రసిద్ధ ఆలయాల పక్కనే టూరిస్ట్ స్పాట్‌లు ఉన్న సౌకర్యాలు లేక వెళ్లలేకపోతున్నారని చెప్పారు.

విజయవాడ: టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కందుల దుర్గేశ్ (Minister Kandula Durgesh) వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో టూరిజం వెనుకబడిందని చెప్పారు. ఇప్పుడు వచ్చిన కొత్త టూరిజం పాలసీ రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. టూరిజంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక శ్రద్ధ ఉందని అన్నారు. పర్యాటక శాఖ బావుంటేనే పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయనే నమ్మకం తమకుందని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు.


అందులో భాగంగా టూరిజం కోసం కొత్త పాలసీ తీసుకువచ్చామని తెలిపారు. కొత్త టూరిజం పాలసీ చూశారు.. దీనిపై మీరు ముందుకు రావాలని అన్నారు. గత 6 నెలలుగా టూరిజంపై రోజు సమీక్ష చేస్తున్నామని అన్నారు. పరిశ్రమలకు ఏ విధంగా అయితే రాయితీలు ఇస్తామో టూరిజంలో పెట్టుబడికి కూడా అందిస్తామని అన్నారు. ఒక్క రోజు ఉండాలని వచ్చే పర్యాటకులు రెండు మూడు రోజులు ఉండే విధంగా చేయటమే మన విజయమని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.


ఆలయాలకు వచ్చే భక్తులు వసతులు లేక కేవలం దర్శనాలకే పరిమితం అవుతున్నారని అన్నారు. ప్రసిద్ధ ఆలయాల పక్కనే టూరిస్ట్ స్పాట్‌లు ఉన్న సౌకర్యాలు లేక వెళ్లలేకపోతున్నారని చెప్పారు. మంచి వసతులు కల్పిస్తే టూరిజం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ ఐదేళ్లలో కొత్త టూరిజం పాలసీలో రూ.25వేల కోట్లు పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామన్నారు. ‘‘మీరు ఎటువంటి ప్రాజెక్ట్స్‌తో ముందుకు వస్తారో అనేది మీ ఇష్టం. ఇక్కడ మీకు ఎటువంటి భయం లేదు. అఖండ గోదావరి, గండికోట అనే రెండు ప్రాజెక్ట్స్ తీసుకువచ్చాం. మీకు కావాల్సిన రాయితీలు మేము ఇస్తాం’’ అని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు.


ఏపీలో టూరిజానికి పారిశ్రామిక హోదా..

కూటమి ప్రభుత్వ ఐదేళ్లలో టూరిజం నూతన పాలసీ సిద్ధమవుతుందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఏపీలో టూరిజానికి పారిశ్రామిక హోదా ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం పర్యాటకంగా నష్టపోయిందని విమర్శించారు.


పర్యాటకం పడకేసిన సందర్భం జగన్ ప్రభుత్వంలో చోటు చేసుకుందని విమర్శించారు. ఈ ప్రభుత్వం పర్యాటకానికి పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. పర్యాటక కోసం స్వదేశీ, ప్రసాద్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం ఏపీకి సహకారం ఇస్తుందన్నారు. విశాఖలో షూటింగ్స్ కోసం సింగిల్ విండో సిస్టం తీసుకొస్తామన్నారు. రుషికొండ భవనాలను ఏం చేయాలో అన్నదానిపై నెల రోజుల్లో కొలిక్కి వస్తుందన్నారు. అవినీతికి కెరాఫ్ అడ్రస్‌గా చూపుతూ రుషికొండ భవనాలను మ్యూజియం చేయాలన్నారు. ఈసారి బీచ్ పెస్టివల్స్ జనవరిలో నిర్వహిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

YSRCP : సజ్జల భార్గవ్‌ కేసుల వివరాలన్నీ ఇవ్వండి

Political Conflict : వైసీపీ నేతల ఆగడాలు అడ్డుకోండి

AP Skill Development : ఏపీలో 532 స్కిల్‌ హబ్‌లు

Read Latest AP News and Telugu News

Updated Date - Dec 17 , 2024 | 02:24 PM