AP News: FSSAIతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం.. వివరాలు ఇవే..
ABN, Publish Date - Oct 08 , 2024 | 07:59 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఆహార భద్రత పెంపొందించేందుకు ఏపీ ప్రభుత్వం(AP Govt) కీలక అడుగు వేసింది. ఆహార భద్రత, ప్రమాణాల నిర్ధారణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI)తో చంద్రబాబు సర్కార్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆహార భద్రత పెంపొందించేందుకు ఏపీ ప్రభుత్వం (AP Govt) కీలక అడుగు వేసింది. ఆహార భద్రత, ప్రమాణాల నిర్ధారణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI)తో చంద్రబాబు సర్కార్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.88కోట్లతో ల్యాబ్స్ ఏర్పాటు చేయనుంది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆహార భద్రత, ప్రమాణాల్లో రాష్ట్రం ర్యాంకు పూర్తిగా దిగజారడంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని FSSAI కేంద్ర కార్యాలయంలో ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సమక్షంలో ఒప్పందం జరిగింది.
ఈ మేరకు రూ.88కోట్లతో ల్యాబ్స్ ఏర్పాటు, మౌలిక వసతులు, సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చేలా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా విశాఖపట్నం, తిరుమల, కర్నూలులో ఉన్నతస్థాయి మైక్రో బయాలజీ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఐదు ప్రాథమిక ల్యాబ్స్, 15మొబైల్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కొక్క ఉన్నతస్థాయి ల్యాబ్‌లో రూ.21కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల రాష్ట్రంలో ఆహార భద్రత, ప్రమాణాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి సత్య కుమార్‌కు ఆహార పదార్థాల్లో కల్తీ, రసాయనాలు వినియోగాన్ని గురించి అధికారులు వివరించారు. రసాయనాలు ఉపయోగించడం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే పలు రకాల రోగుల బారిన ప్రజలు పడుతున్నారని మంత్రికి అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆహార భద్రత, ప్రమాణాలపై మంత్రి సత్య కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగానే ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో15ప్రాథమిక, మూడు ఉన్నతస్థాయి మైక్రో బయాలజీ లాబ్స్ సహా 15 మెుబైల్ ల్యాబ్స్ ఏర్పాటు అయితే ఆహార పదార్థాల కల్తీ, రసాయన వినియోగాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మొబైల్ ల్యాబ్స్ ద్వారా కూరగాయల మార్కెట్‌ల్లో తనిఖీలు చేసే అవకాశం లభిస్తుంది. అలాగే రద్దీగా ఉండే ఆలయాల ప్రాంతాల్లో ఇకపై ముమ్మర తనిఖీలు నిర్వహించడానికి, ఆహార వ్యాపారులకు అవగాహన పెంచేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Vijayawada: ఘోరం.. రోడ్డుప్రమాదంలో భర్త మృతి.. తట్టుకోలేక భార్య..
బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత.. ఎంతమంది అంటే..
Pawan Kalyan: బాలికపై అత్యాచారం.. తీవ్రంగా స్పందించిన పవన్ కల్యాణ్..
Updated Date - Oct 08 , 2024 | 08:02 PM