ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt: పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ABN, Publish Date - Oct 20 , 2024 | 08:25 PM

పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.. అక్టోబర్ 26 నుంచి ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఓ ప్రకటన విడుదల చేశారు.

అమరావతి: పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.. అక్టోబర్ 26 నుంచి ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారంతంలో ప్రముఖ ఆధ్యాత్మిక దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఒక రోజు టూర్ ప్యాకేజీకి పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తుందని వెల్లడించారు.


అసెంబ్లీలో ఎమ్మెల్యేల సూచనల మేరకు ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. భక్తులకు ఆధ్యాత్మిక సాంత్వనను అందించడానికి 6 పుణ్య క్షేత్రాలతో ఆధ్యాత్మిక యాత్ర సందర్శనకు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను కలుపుతూ ప్రతి శనివారం అందుబాటులో బస్సులు తిరుగుతాయని అన్నారు. పర్యాటకుల రద్దీ, డిమాండ్ దృష్ట్యా ఆదివారం కూడా బస్సులు ఏర్పాటు చేసే యోచన ఉందని చెప్పారు.. రాజమహేంద్రవరం సరస్వతీ ఘాట్ వద్ద టూరిజం శాఖకు సంబంధించిన ఇన్‌ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ కార్యాలయం (ఐఆర్ఓ) వద్ద ఉదయం 6 గంటలకు బస్సులు ప్రారంభం అవుతాయని.. తిరిగి రాత్రి 7.30గంటలకు ప్రయాణం. ముగుస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.


త్వరలోనే ఈ బస్సులు ప్రారంభమవుతాయని తెలిపారు. పెద్దలకు రూ.1,000, 3 నుంచి10 ఏళ్ల వయస్సు గల చిన్నారులకు రూ. 800 టికెట్ ఉంటుందని తెలిపారు. ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మిక కలయికగా టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి దుర్గేష్ కోరారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ టూర్ ప్యాకేజీ వివరాలను వివరించారు.


పర్యాటకానికి ముఖద్వారమైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొలుత అత్యంత ప్రసిద్ధి చెందిన పురాతన క్షేత్రమైన కోరుకొండ స్వయం భూ శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి దేవస్థానం దర్శించిన అనంతరం రత్నగిరి కొండపై వెలసి భక్తుల కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా నిలిచిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయ దర్శనం, ఆ తర్వాత పితృముక్తి క్షేత్రంగా, పాదగయ తీర్థంగా పేరొందిన పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయం దర్శించిన అనంతరం విశాలమైన ప్రాకారాలతో, చాళక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతూ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోటలోని శ్రీ చాళుక్య కుమారరామ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయాన్ని యాత్రికులు దర్శించుకుంటారని తెలిపారు.


సామర్లకోట దేవాలయంలో మధ్యాహ్నం అన్న ప్రసాదాలు స్వీకరించిన అనంతరం అత్యంత ప్రాచీన మహిమాన్విత శివలింగ క్షేత్రం ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయాన్ని యాత్రికులు సందర్శిస్తారని తెలిపారు. ఆ తర్వాత కోనసీమ తిరుపతిగా, ఏడు శనివారాల వెంకన్న దేవుడిగా భక్తులచే కీర్తి పొంది విశేషంగా ఆకట్టుకుంటున్న వాడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని యాత్రికులు సందర్శించేలా ఒక రోజు టూర్ ప్యాకేజీని నిర్ణయించామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. అక్టోబర్ 26 నుంచి బస్సులు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.


రాజమహేంద్రవరంలోని సరస్వతీ ఘాట్ వద్ద పర్యాటక శాఖకు సంబంధించిన ఇన్‌ఫ‌ర్మేషన్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ కార్యాలయం (ఐఆర్ఓ) వద్ద ప్రతి శనివారం ఉదయం 6 గంటలకు బయలుదేరి పర్యాటకుల బస్సు కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాల మీదుగా రాత్రి 7.00 గంటలకు రాజమహేంద్రవరంలోని హేవలాక్ బ్రిడ్జి దగ్గర పుష్కర్ ఘాట్‌కు చేరుకుంటుందని అన్నారు. అక్కడే పవిత్ర గోదావరి నదికి కన్నుల పండువగా హారతి ఇచ్చే ప్రాంతంలో మంత్ర ముగ్ద దృశ్యాలను భక్తులు తిలకించేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. భక్తులు ఆధ్యాత్మిక ప్రపంచంలో మునిగి తేలేలా కార్యక్రమం పూర్తయిన అనంతరం 7.30 గంటలకు తిరిగి రాజమహేంద్రవరంలోని ఏపీటీడీసీకి చెందిన ఇన్‌ఫ‌ర్మేషన్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ కార్యాలయం వద్దకు యాత్రికులను చేరవేస్తామని అన్నారు. ఇంతటితో యాత్ర సమాప్తమవుతుందని తెలిపారు. వివరాల కోసం యాత్రికులు ఐఆర్ఓను సంప్రదించాలని తెలిపారు.


18 మంది సీటింగ్ సామర్థ్యంతో బయలుదేరే బస్సు ఆద్యంతం ప్రకృతి రమణీయత దృశ్యాల నడుమ ప్రయాణించేలా ప్రణాళిక రూపొందించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెడుతున్న ఈ ఆధ్యాత్మిక యాత్ర భక్తులకు మానసికోల్లాసాన్ని కలిగించి ఆధ్యాత్మిక భావనను పెంచుతుందని భావిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తుందని వెల్లడించారు.


యాత్రికుల కోరిక మేరకు 18 మంది సమూహంతో పర్యాటక శాఖను సంప్రదిస్తే బస్సు ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక భావనతో పాటు సాంస్కృతిక, చారిత్రాత్మిక ప్రదేశాలకు మరింత వెలుగులు అద్దడమే టూర్ ప్యాకేజీ ముఖ్య ఉద్దేశమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Amaravati: అతనికి మరణ శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి.. బద్వేల్ ఘటనపై సీఎం చంద్రబాబు

Minister Kondapalli: ప్రజలు భయాందోళన చెందేలా ప్రతిపక్షాల వ్యాఖ్యలు..

AP News: ఏబీఎన్‌తో మంత్రి ఆనం ఆసక్తికర వ్యాఖ్యలు..

For more AP News and Telugu News

Updated Date - Oct 20 , 2024 | 09:49 PM