ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP High Court: EWS కోటా మెడికల్ సీట్ల కేటాయింపు జీవో నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు..

ABN, Publish Date - Aug 13 , 2024 | 06:57 PM

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కళాశాలల్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (EWS) కోటా కింద సీట్ల కేటాయింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

AP High Court

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కళాశాలల్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (EWS) కోటా కింద సీట్ల కేటాయింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ మెడికల్ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ(మంగళవారం) విచారణ జరిగింది. మెడికల్ సీట్లను పెంచి EWS కోటా కింద భర్తీ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అడ్వకేట్ ఠాకూర్ వాదనలు వినిపించారు. ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు పెంచకుండానే EWS కింద కేటాయింపు చేయాలంటూ ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు ధర్మాసనం దృష్టికి అడ్వకేట్ ఠాకూర్ తీసుకెళ్లారు. దీని వల్ల ఓపెన్ కేటగిరీ విద్యార్థులు నష్టపోతారని ఆయన హైకోర్టుకు తెలిపారు. దీంతో జీవోను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 6వారాలకి వాయిదా వేసింది.

ఈ వార్త కూడా చదవండి:

Minister Anagani: రౌడీయిజం చేసిన జోగి రమేశ్ ఇవాళ నీతులు చెబుతున్నారు..

Updated Date - Aug 13 , 2024 | 06:58 PM

Advertising
Advertising
<