ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP NEWS: జగన్, షర్మిల ఆస్తి వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Nov 19 , 2024 | 12:01 PM

వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల తగాదాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఇప్పుడు హాట్ టాపిక్ అంతా ఇదే విషయం నడుస్తోంది. వారసత్వ హక్కుగా రావాల్సిన ఆస్తిని చెల్లికి దక్కకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అమరావతి: ఏపీలో ఆస్తుల కోసం మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైఎస్ విజయలక్ష్మి వివాదంపై బీజేపీ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి చురకలు అంటించారు. రాష్ట్ర చరిత్రలో నేటి వరకు ఏ ముఖ్యమంత్రి పిల్లలు ఆస్తుల కోసం రోడ్డు మీద పడి కొట్టుకోలేదని అన్నారు. ఆ ఆస్తులు స్వార్జితమో, పితృ ఆర్జితమో కాదని అన్నారు. అక్రమంగా సంపాదించిన ఆస్తుల కోసం తల్లి పిల్లలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పైగా ఆ ఆస్తులు కూడా ఈడీ, సీబీఐ అధికారులు సీజ్ చేశారని గుర్తుచేశారు. వాటి కోసం వీరు తన్నుకోవడం ఏమిటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్నారు. వీళ్లు సంపాదించని, వీళ్లవి కానీ ఆస్తుల కోసం కొట్టుకోవడంపై అందరు చర్చించుకుంటున్నారని నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తెలిపారు.


నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు..

కాగా.. ఆస్తుల వివాదంపై వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. క్లాసిక్ రియాల్టీ ప్రయివేట్ లిమిటెడ్, వైస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి రెడ్డి పేర్లతో ఈ ఏడాది ఐదు పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రయివేట్ లిమిటెడ్, జగన్ చెల్లెలు వైఎస్ షర్మిలా రెడ్డి, తన తల్లి వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డితో పాటు జనార్థన్ రెడ్డి చాగరి, యశ్వంత్ రెడ్డి కేతిరెడ్డి, రీజనర్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రర్ ఆఫ్ కంపెనీస్, తెలంగాణను ఆయన రెస్పాండెంట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 3వ తేదీన ఒక పిటిషన్ ఫిల్ చేయగా, సెప్టెంబర్ 11వ తేదీన మూడు పిటిషన్లు, అక్టోబర్ 18న మరో పిటిషన్‌ను జగన్మోహన్ రెడ్డి, షర్మిల రెడ్డి, క్లాసిక్ రియాల్టీ ప్రయివేట్ లిమిటెడ్‌ పేరుతో దాఖలు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రయివేట్ లిమిటెడ్‌లో వైఎస్ జగన్‌కు షేర్లు ఉన్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆ కంపెనీలో షేర్ల వాటా పంపకాల విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తడంతోనే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సరస్వతి కంపెనీ షేర్ల వివాదంలో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 ఆగస్టు 21 ఎంవోయూ ప్రకారం విజయమ్మ, షర్మిలకు కంపెనీ షేర్లు కేటాయించామని, వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ షేర్లను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని పిటిషన్ వేశారు.


కేసు నెంబర్లు ఇవే..

ఈ ఏడాది సెప్టెంబర్3వ తేదీన ఫిల్ కేసిన కేసు నెంబర్ CP- 48/2024 కాగా, సెప్టెంబర్ 11వ తేదీన IA (కంపెనీస్ యాక్ట్)-268/2024, IA (కంపెనీస్ యాక్ట్)-266/2024, IA (కంపెనీస్ యాక్ట్)-267/2024 కేసు నెంబర్లతో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 18న IA (కంపెనీస్ యాక్ట్)-319/2024 కేసు నెంబర్‌తో పిటిషన్ దాఖలైంది. సెప్టెంబర్3వ తేదీన దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి రెస్పాండెట్లకు రాజీవ్ భరద్వాజ్, సంజయ్ పురి కోరం నోటీసులను జారీ చేస్తూ తదుపరి విచారణను నవంబర్8వ తేదీకి వాయిదా వేసింది. జగన్మోహన్ రెడ్డి తరపున న్యాయవాది వై సూర్యనారాయణ వాదనలు వినిపిస్తున్నారు.

Updated Date - Nov 19 , 2024 | 12:05 PM