CM Chandrababu: పెరిగిన పెన్షన్.. లబ్ధిదారుల హర్షం
ABN, Publish Date - Jun 23 , 2024 | 09:38 PM
ఏపీ పింఛన్ (AP Pension) లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) శుభవార్త చెప్పారు. ఎన్డీఏ కూటమి సూపర్ - 6 లో భాగంగా బాబు హామీ ఇచ్చినట్లే పింఛన్ పెంచి ఇవ్వనున్నారు. అలాగే సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సమయంలో కూడా పెన్షన్లపై సంతకం చేసిన విషయం తెలిసిందే.
అమరావతి: ఏపీ పింఛన్ (AP Pension) లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) శుభవార్త చెప్పారు. ఎన్డీఏ కూటమి సూపర్ - 6 లో భాగంగా బాబు హామీ ఇచ్చినట్లే పింఛన్ పెంచి ఇవ్వనున్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సమయంలో పెన్షన్లపై సంతకం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా లబ్ధిదారులకు చంద్రబాబు ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్ కంటే అదనంగా పెంచి ఇవ్వనున్నారు. పెన్షన్ పెంచి ఇవ్వనుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటి దగ్గరే ఇస్తాం!
ఈ మేరకు ట్విట్టర్(X) వేదికగా టీడీపీ అధికారిక ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ‘పింఛన్ల లబ్ధిదారులకు చంద్రబాబు గారు ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నారు. వెయ్యి పెంచగా అయిన రూ.4000, గత మూడు నెలల పెంపు రూ.3000 కలిపి రూ.7000 పింఛన్ ఎన్టీఆర్ భరోసా పేరుతో జూలై 1న ఇంటి వద్దే అందించనున్నాం’ అని టీడీపీ ట్విట్టర్‌లో పేర్కొంది.
Updated Date - Jun 23 , 2024 | 10:28 PM