ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu : ఉద్యోగులకు సీఎం చంద్రబాబు హితబోధ..

ABN, Publish Date - Nov 26 , 2024 | 06:55 PM

ఉద్యోగులు 6 గంటల తర్వాత కార్యాలయాల్లో ఉండొద్దనేది ఇప్పుడు తన విధానమని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయ ఉద్యోగులతో సహా ఏ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ గంటలు కష్టపడాల్సిన పనిలేదని చెప్పారు.

అమరావతి: రాజ్యాంగ దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ (మంగళవారం) ఏపీ సచివాలయంలో జరిగిన 75వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో (75th Constitution Day) సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. స్మార్ట్ వర్క్ చేయండి... సాయంత్రం 6 తర్వాత ఆఫీస్‌లో ఉండొద్దని సూచించారు. తాను కూడా 6 గంటలకే సచివాలయం నుంచి వెళ్లిపోతానని చెప్పారు. ఉద్యోగులు హార్డ్ వర్క్ వద్దని.. స్మార్ట్ వర్క్ చేయాలని హితబోధ చేశారు. గతంలో ఎక్కువ గంటలు కార్యాలయంలో ఉండి పనిచేసే సంస్కృతి ఉండేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.


టెక్నాలజీ కారణంగా ఆ అవసరం ఇప్పుడు లేదని సీఎం చంద్రబాబు అన్నారు. 6 గంటల తర్వాత ఎవరూ కార్యాలయాల్లో ఉండొద్దనేది ఇప్పుడు తన విధానమని అన్నారు. సచివాలయ ఉద్యోగులతో సహా ఏ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ గంటలు కష్టపడాల్సిన పనిలేదని చెప్పారు. స్మార్ట్ వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. తాను కూడా సచివాలయం నుంచి 6 గంటలకే ఇంటికి వేళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. రాజ్యాంగ దినోత్సవ సభలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల గురించి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.


సవాళ్లను అధిగమిస్తున్నాం..

రాజ్యాంగం అమలు చేసి 75 సంవత్సరాలు అయినా సవాళ్లను అధిగమించి ముందుకు వెళ్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవంతోపాటు, జనవరి 26ను జరుపుకుంటున్నామని, అయితే రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును కూడా పాటించాలని అన్నారు. భారత రాజ్యాంగం అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు అందరికి పవిత్రమైన గ్రంధం ఇదని పేర్కొన్నారు.


వారితో రాజ్యాంగ ప్రయోజనం ఉండదు..

ప్రపంచంలో ఉండే అన్ని దేశాల రాజ్యాంగాలను అధ్యాయనం చేసి అందులోని బెస్ట్ ప్రాక్టిస్ తీసుకుని దేశానికి రాజ్యాంగం తయారు చేశారని, భవిష్యత్తు సవాళ్లను కూడా ఊహించి రాజ్యాంగంలో పరిష్కారాలు చూపారని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ నుంచి 11మంది రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. సాంఘిక, ఆర్థిక , రాజకీయ న్యాయాన్ని ఆరోజే కల్పించేలా రాజ్యాంగంలో ఉంచారని చెప్పారు. సమానత్వంపై ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ రాజ్యాంగాన్ని భారత పౌరులుగా మనకు మనం సమర్పించుకుంటున్నట్టు రాశారని చెప్పారు. ఎంతమంచి రాజ్యాంగం ఉన్నా.. అమలు చేస్తున్న వారు చెడ్డవారైతే రాజ్యాంగం వల్ల ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. ఎంత చెడ్డ రాజ్యాంగం ఉన్నా అమలు పరిచే వ్యక్తులు మంచి వారైతే దాని వల్ల మంచే జరగుతుందన్నారు. ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే దాన్ని కరెక్టు చేసే శక్తి ఓటర్లకు ఉందన్నారు. ఎవ్వరు అయినా రాజ్యాంగాన్ని అతిక్రమించినా రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసినా అది రాజ్యాంగ ఉల్లంఘనేనని, గత అయిదేళ్లుగా ఏపీలో కూడా అనేక ఇబ్బందులు వచ్చాయని, రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రాథమిక హక్కులు కాలరాశారని విమర్శించారు. రాజ్యాంగంలో జరిగిన తప్పిదాలు వల్ల కొన్ని దశాబ్దాలు ఇబ్బంది పడతామని చంద్రబాబు పేర్కొన్నారు.


టెక్నాలజీ వల్ల ఆర్ధిక సృష్టి..

ఆర్థిక సంస్కరణలతో సంపద సృష్టి జరిగిందని.. అయితే ఆ సంపద కిందిస్ధాయి వారి వరకూ తీసుకువెళ్లగలగాలనే ఉద్దేశంతో 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించామని కొంత సంపద వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. జీరో పావర్టీ కోసం సంపదను ఉపయోగించుకోవడం అవసరమని, టెక్నాలజీ వల్ల ఆర్ధిక సృష్టి సులువు అయ్యిందని.. దీనికి డెమెక్రాటిక్ డివిడెంట్ అడ్వాంటెజ్‌గా ఉందని సీఎం అన్నారు. గత ఐదేళ్లు మర్చిపోదాం అనుకున్నా.. అందరికి గుర్తుండాలని.. నాల్గోసారి సీఎం అయినా ఇంకా పూర్తిగా విధ్వంసానికి గురైన వ్యవస్థను కాపాడటం కష్టంగా ఉందన్నారు. గతంలో ఎక్కువ సమయం పనిచేయాల్సి వచ్చిందని... ఇప్పడు ఎక్కవ పని కాకుండా స్మార్ట్ వర్కు చేయాలని.. అందుకే సాయంత్రం 6 గంటల తర్వాత మీటింగులను వీలున్నంత వరకూ తగ్గిస్తానని చంద్రబాబు చెప్పారు. చిన్న పిల్లలకు కూడా రాజ్యాంగం పట్ల అవగాహన రావాలని.. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు అందరం దేవుడిని ప్రార్థిస్తామని.. అయితే రాజ్యాంగాన్ని గౌరవించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Updated Date - Nov 26 , 2024 | 07:09 PM