ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. ఏం జరుగుతుందో..?

ABN, Publish Date - Jul 26 , 2024 | 09:02 PM

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) మరోసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శుక్రవారం నాడు సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా సీఎం అధికారిక నివాసం1 జనపథ్‌కు వెళ్లనున్నారు.

AP CM Nara Chandrababu Naidu

ఢిల్లీ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) మరోసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శుక్రవారం నాడు సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా సీఎం అధికారిక నివాసం1 జనపథ్‌కు వెళ్లనున్నారు. శనివారం నాడు ఉదయం 9 గంటలకు జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.


బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌తో పాటు విపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. 2047లో వికసిత్ భారత్ ఎజెండాగా నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం జరగనుంది. వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్‌పై నీతి ఆయోగ్ పాలకమండలి చర్చించనుంది. వికసిత్ భారత్ 2047కి రోడ్ మ్యాప్‌ను రూపొందించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామం, సహకారం, గ్రామీణ, పట్టణ జనాభా జీవన ప్రమాణాల పెంపు తదితర అంశాలపైనా పాలకమండలి సమావేశంలో చర్చించనుంది. సులభతర జీవనం, భవిష్యత్తు అభివృద్ధి, భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం లాంటి అంశాలపైనా నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రులు సలహాలు, సూచనలు చేయనున్నారు.


గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన మూడో జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం సిఫార్సులపైనా పాలకమండలి సమావేశంలో చర్చించనుంది. తాగునీరు, విద్యుత్, ఆరోగ్యం, పాఠశాల విద్య, భూమి, ఆస్థి అనే ఐదు అంశాలపైన కీలకమైన సిఫార్సులపై సమావేశంలో చర్చించనున్నారు. సైబర్ సెక్యూరిటీ, ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాక్‌ల కార్యక్రమం, రాష్ట్రాల పాత్ర , పరిపాలనలో కృత్రిమ మేథ లాంటి అంశాలపైనా మూడో జాతీయ ప్రధాన కార్యదర్శుల సదస్సులో కూడా చర్చించనున్నారు. మూడో జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం సిఫార్సులను నీతిఆయోగ్ 9వ పాలకమండలి సమావేశంలో ఆమోదించనున్నారు.

Updated Date - Jul 26 , 2024 | 09:35 PM

Advertising
Advertising
<