ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

ABN, Publish Date - Aug 31 , 2024 | 07:32 PM

ఆంధ్రప్రదేశ్‎లో కురుస్తున్న భారీ వర్షాలపై ఈరోజు(శనివారం) ఉదయం నుంచి నిరంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాతావరణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు.

CM Chandrababu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‎లో కురుస్తున్న భారీ వర్షాలపై ఈరోజు(శనివారం) ఉదయం నుంచి నిరంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాతావరణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. మరోసారి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీవోలు, డీఎస్పీలతో మాట్లాడి తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. సహాయ చర్యల కోసం జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున తక్షణం నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.


భారీ వర్షాల కారణంగా 8 మంది చనిపోయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు సీఎం తెలిపారు. రేపు(ఆదివారం) కూడా భారీ వర్షాలు ఉంటాయన్న సమాచారం నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ విభాగం పూర్తి అప్రమత్తతో ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే, శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం మధ్య ఈరోజు రాత్రికి తుఫాను తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.


మూడు జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తతతో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. రాత్రి అంతా మెలకువతో ఉండి అయినా సరే ప్రజల రక్షణ కోసం పని చేద్దామని సీఎం సూచించారు. తుఫాను తీరం దాటే సమయంలో 55 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గాలుల వేగంపై స్పష్టమైన అంచనాలతో సన్నద్ధంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పుడు తుఫాను ఎంత వేగంతో ప్రయాణిస్తుందో.. ఎటువైపు వెళ్తుంది అనే విషయాన్ని విశ్లేషించి అందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. నష్టం జరిగిన తర్వాత స్పందించడం కాదని.. నష్టం తగ్గించేలా అధికారుల పనితీరు ఉండాలని చంద్రబాబు తెలిపారు. హుద్ హుద్ తుఫాను సమయంలో అనుసరించిన బెస్ట్ ప్రాక్టీసెస్‎ను ఇప్పుడు పాటించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

Updated Date - Aug 31 , 2024 | 07:39 PM

Advertising
Advertising