ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: పార్టీకి కార్యకర్తలే బలం...వారి త్యాగాలను మర్చిపోలేం

ABN, Publish Date - Sep 22 , 2024 | 06:37 PM

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారని చెప్పారు. ప్రతి ఇంటికెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని సూచించారు.

అమరావతి: మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు, గ్రామస్థాయి పార్టీ నేతలతో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(ఆదివారం) మంగళగిరిలోని పార్టీ కార్యలయంలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీకి కార్యకర్తలే బలం...వారి త్యాగాలను మర్చిపోలేమని అన్నారు. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.


ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని అన్నారు. 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు అంటున్నారని చెప్పారు. ప్రతి ఇంటికెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని సూచించారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తామని అన్నారు. జగన్ ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించి ప్రజల మనోభావాలు దెబ్బతీసిందని... దోషులను వదిలిపెట్టమని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వ తప్పులు సరిదిద్దుతూ....వ్యవస్థలను చక్కదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.

Updated Date - Sep 22 , 2024 | 08:16 PM