Guntur: ఆ సమావేశం షెడ్యూల్ మారుస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ..
ABN, Publish Date - Dec 01 , 2024 | 10:42 AM
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం షెడ్యూల్‌లో కీలక మార్పులు జరిగాయి. డిసెంబర్ 4వ తేదీన జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం తేదీని మారుస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం షెడ్యూల్‌లో మార్పు జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన డిసెంబర్ 4వ తేదీన జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశాన్ని డిసెంబర్ 3వ తేదీ(మంగళవారం)కి మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తొలుత డిసెంబర్ 4న వెలగపూడి సచివాలయం మొదటి బ్లాక్ మీటింగ్ హాలులో సమావేశం ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తాజాగా సమావేశం తేదీని ఒకరోజు ముందుకు మార్చుతూ మళ్లీ ఆదేశాలు జారీ చేశారు.
అలాగే ఈ సమావేశంలో చర్చించాల్సిన ప్రతిపాదనలను డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా పంపాలని పలు శాఖలను సీఎస్ ఆదేశించారు. పేదలకు రేషన్ కార్డులు జారీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సూపర్ సిక్స్ పథకాలు, ఇసుక పాలసీ, ఎన్నికల హామీలు సహా పలు అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది. ఇటీవల సంచలనంగా మారిన అదానీ విద్యుత్ కొనుగోళ్ల లంచం వ్యవహారం, అందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్ర వంటి అంశాలపైనా సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా, నవంబర్ 20న క్యాబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Anantapur : ఘోరం.. మంచు కారణంగా అదుపుతప్పిన కారు.. ఎంతమంది మృతంటే..
Tiruvuru: భయంతో పరుగులు పెట్టిన మహిళ.. విషయం ఇదే..
Updated Date - Dec 01 , 2024 | 11:21 AM