ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyber Crime: హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ అంటూ మెసేజ్.. క్లిక్ చేశారో..

ABN, Publish Date - Dec 29 , 2024 | 12:08 PM

డిసెంబర్ 31 నుంచి జనవరి మెుదటి వారం వరకూ గ్రీటింగ్ కార్డుల పేరుతో వాట్సాప్ మెసేజ్‌లు, మెయిల్స్‌ను సైబర్ కేటుగాళ్లు పంపే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులకు మీ పేరుతో న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులు పంపాలనుకుంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాలంటూ మెసేజ్‌లు పంపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Cyber Crime Alert

అమరావతి: నూతన సంవత్సరం వేళ సైబర్ నేరస్థులు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ప్రజలను అనేక రకాలుగా బురిడీ కొట్టించారని, న్యూ ఇయర్ సందర్భంగా కొత్త తరహా మోసాలకు పాల్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. గ్రీటింగ్ కార్డుల పేరుతో నేరాలు జరిగే ప్రమాదం ఉన్నందున ప్రజలు దీనిపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు.


డిసెంబర్ 31 నుంచి జనవరి మెుదటి వారం వరకూ గ్రీటింగ్ కార్డుల పేరుతో వాట్సాప్ మెసేజ్‌లు, మెయిల్స్‌ను సైబర్ కేటుగాళ్లు పంపే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులకు మీ పేరుతో న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులు పంపాలనుకుంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాలంటూ మెసేజ్‌లు పంపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు పంపే అలాంటి లింకులపై ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయెుద్దని సూచిస్తున్నారు. అలాంటి సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఆ లింకులపై నొక్కితే ఏపీకే ఫైల్ రకం మాల్వేర్‌తో మీ ఫోన్ లేదా ల్యాప్ ట్యాప్‌లు హ్యాక్ చేస్తారని హెచ్చరిస్తున్నారు.


ఒకవేళ మీ ఫోన్ హ్యాక్ అయితే దాని యాక్సెస్ సైబర్ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని చెబుతున్నారు. దీంతో మొబైల్ డేటా, ఫొటో, వీడియో గ్యాలరీలు, కాంటాక్ట్ నంబర్లు వంటివి దొంగిలిస్తారని హెచ్చరిస్తున్నారు. మీ బ్యాంక్ ఖాతా వివరాలు సైతం వారి గుప్పిట్లోకి వెళ్తాయని, దీంతో మీరు ఆర్థిక మోసానికి గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ లింకులపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.

Updated Date - Dec 29 , 2024 | 12:08 PM