ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala Laddu Issue: లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తున్నాం: డిప్యూటీ సీఎం పవన్..

ABN, Publish Date - Oct 04 , 2024 | 08:33 PM

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మాజీ మంత్రి, సింహాచలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ అశోక్ గజపతిరాజు అన్నారు.

అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మాజీ మంత్రి, సింహాచలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ అశోక్ గజపతిరాజు అన్నారు. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం మంచి పరిణామమని పవన్ కల్యాణ్ చెప్పారు. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారులు, ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండే స్వతంత్ర సిట్ విచారణ ద్వారా నిజాలు నిగ్గు తేలుతాయని అశోక్ గజపతి రాజు అన్నారు.


దోషులను తేల్చాలి..

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.."తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న వార్త వెల్లడైనప్పటి నుంచి సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఆందోళనతో ఉన్నారు. గత పాలకులు నియమించిన టీటీడీ బోర్డు హయాంలో లడ్డూ ప్రసాదం, స్వామివారి కైంకర్యాలు, అన్న ప్రసాదం అన్నింటా నాణ్యతా ప్రమాణాలు లోపించాయనే భక్తులు ఆవేదనను సిట్ పరిగణనలోకి తీసుకోవాలి. పవిత్ర క్షేత్రం తిరుమలలో గత పాలక మండళ్లు చేసిన నిర్ణయాలు, వారి పాలనా తీరును సమగ్రంగా సమీక్షించి సంస్కరించే బాధ్యతను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంది. తప్పుడు నిర్ణయాలకు, అపవిత్ర చర్యలకు కారకులైన వారిని నిబంధనల ప్రకారం బాధ్యులను చేస్తాం. స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఇప్పటికైనా వారి విచారణ ద్వారా దోషులను తేల్చే అవకాశం ఉంటుంది. దోషులు తేలితే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ఇలాంటి శిక్షల వల్ల మరోసారి ఎవరూ స్వామివారి విషయంలో అపవిత్ర పనులకు పాల్పడే అవకాశం లేకుండా చేస్తాం" అన్నారు.


ల్యాబ్ అవసరం..

తిరుపతి లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రి, సింహాచలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ అశోక్ గజపతిరాజు అన్నారు. విచారణ త్వరగా చేపట్టి సిట్ నివేదిక ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. స్వామివారి ప్రసాదం విషయంలో దుర్మార్గానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని గజపతిరాజు కోరారు. వైసీపీ ప్రభుత్వంలో తిరుపతితోపాటు అనేక దేవాలయాల్లో ప్రసాదం క్వాలిటీ పడిపోయిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "కామన్ గుడ్ ఫండ్‌తో ప్రతి జిల్లాలో ఒక లేబొరేటరీ ఏర్పాటు చేయాలి. ప్రసాదాలపై అనుమానం వస్తే అక్కడ టెస్టులు చేయాలి. గతంలో నమ్మకంపైనే దేవాలయాలు నడిచేవి. ఇప్పుడు భక్తులకు ట్రస్టులపై నమ్మకాలు పోయాయి. దేవాలయాల్లో నిబంధనలు సడలించారు. అందుకే ఇలాంటి పరిస్థితులు దాపురించారు. మతంలో రాజకీయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆలయాల పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది.


వాటిపై చర్యలేవి..

దేవాలయాలను రాజకీయాలకు దూరం చేయాలి. ఇంట్లో ఒక మతం రోడ్డుపై మరో మతం ఉండకూడదు. వైసీపీ అధినేత జగన్ ఓ జోకర్‌లా తయారయ్యారు. దొంగలు నీతులు బోధిస్తున్నారు. ఆలయాల్లో పాతదర్శకత పెంచాల్సిన అవసరం ఉంది. నేను చాలా మంది ముఖ్యమంత్రిలను చూశా. అన్ని వ్యవస్థలూ నాశనం చేసిన ముఖ్యమంత్రి జగనే. గతంలో రాముడు తల తీసిన వారిని ఇప్పటివరకూ పట్టుకోలేదు. రాష్ట్రంలో 200ఘటనలు జరిగితే ఎవరి మీదా చర్యలు లేవు. దేవాలయాల్లో ఆచారాలు ఆనవాయితీలు కొనసాగించాలి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌లోనూ కొంత తుప్పు పట్టింది. దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. మతానికి ప్రభుత్వం డబ్బులివ్వదు. మతం నుంచి ప్రభుత్వాలు కూడా డబ్బులు తీసుకోకూడదు. సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ చేసిన ప్రతిపాదన స్వాగతిస్తున్నాం. పవన్ కల్యాణ్ కమిట్మెంట్‌తో పని చేస్తున్నారు" అని అన్నారు.

Updated Date - Oct 04 , 2024 | 09:17 PM