AP Elections 2024:అందుకే జగన్ లండన్ వెళ్లారా: డూండీ రాకేష్
ABN, Publish Date - Jun 01 , 2024 | 10:35 PM
ఏపీని సీఎం జగన్ రెడ్డి అప్పుల ఊబిలో నెట్టాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండీ రాకేష్ (Dundee Rakesh) ఆరోపించారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు సమయం దగ్గర పడిందని హెచ్చరించారు. ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ నేతలు గుండెలు గుభేల్ అని కొట్టుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.
అమరావతి: ఏపీని సీఎం జగన్ రెడ్డి అప్పుల ఊబిలో నెట్టాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండీ రాకేష్ (Dundee Rakesh) ఆరోపించారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు సమయం దగ్గర పడిందని హెచ్చరించారు. ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ నేతలు గుండెలు గుభేల్ అని కొట్టుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ఫలితాలను తలుచుకొని వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదని విమర్శించారు.
లండన్ నుంచి వచ్చిన జగన్ మొట్టికాయలు వేయడంతో వైసీపీ నేతలు తమపై కారుకూతలు కూస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడికి వెళ్లాడో చెప్పాలంటూ బుకాయింపులు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్తే వీళ్లకు ఎందుకు? అని ప్రశ్నించారు. జగన్‍లా చంద్రబాబుపై కేసులు లేవని స్పష్టం చేశారు.
జగన్ రెడ్డి తీసుకున్నట్లు... కోర్టులో పర్మిషన్ తీసుకుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని తేల్చిచెప్పారు. జగన్ రెడ్డే ఎక్కడికి వెళ్లాడో భయపెట్టాలన్నారు. ఆయన ఎవరిని కలిశాడో చెప్పాలని నిలదీశారు. పోతూ పోతూ మరోసారి కరెంట్ బిల్లులు పెంచి జనం నడ్డిని జగన్ రెడ్డి విరిచాడని మండిపడ్డారు. ప్రజల సొమ్ములతో హెలికాఫ్టర్లు, విమానాల్లో తిరుగుతూ ప్రజలను అప్పుల పాలు చేశారని ఫైర్ అయ్యారు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చట్టాలను అతిక్రమించిన వారికి, వ్యవస్థలను నాశనం చేసిన వారికి గుణపాఠం చెప్పడం తథ్యమని డూండీ రాకేష్ హెచ్చరించారు.
Updated Date - Jun 01 , 2024 | 10:38 PM