AP News: నరసరావుపేటలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన ఎన్వీ రమణ
ABN, Publish Date - May 20 , 2024 | 03:41 PM
Andhrapradesh: ఎడ్యుకేషన్ అంటే మార్కులు ర్యాంకులే కాదని.. విజ్ఞాన సమూపార్జనే ఎడ్యుకేషన్ ముఖ్య ఉద్దేశమని సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సోమవారం నరసరావుపేటలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ను ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరసరావుపేట లాంటి ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు.
పల్నాడు, మే 20: ఎడ్యుకేషన్ అంటే మార్కులు ర్యాంకులే కాదని.. విజ్ఞాన సమూపార్జనే ఎడ్యుకేషన్ ముఖ్య ఉద్దేశమని సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ (Former CJI NV Ramana) అన్నారు. సోమవారం నరసరావుపేటలో (Narasaraopet) ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ను (Delhi public School) ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరసరావుపేట లాంటి ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందించాలని ఈ పాఠశాల ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. భావితరాల భవిష్యత్తు అనేది విద్య మీదనే ఆధారపడి ఉంటుందని తెలిపారు.
AP Election 2024: సస్పెండ్ అయిన అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగులు
విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, అత్యుత్తమ ఉద్యోగాలు సంపాదించి, ఉన్నత స్థాయికి ఎదిగిన మూలాలు మరిచిపోకూడదన్నారు. మనదైన సంస్కృతి, భాష, సంప్రదాయాలను గుర్తించుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సింది విద్యాసంస్థలే అని చెప్పుకొచ్చారు. దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిలో స్థిరపడిన స్వదేశం స్వగ్రామం మీద మమకారం మరువరాదన్నారు. ప్రపంచంలోనే భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని... అందులో యువత, విద్యార్థులే కీలకపాత్ర పోషించనున్నారని మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, పాల్గొన్న సీనియర్ హైకోర్టు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి....
Ebrahim Raisi: ఇబ్రహీం రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ ఏది.. దాని చరిత్ర ఏంటి?
AP Elections 2024: మంత్రి ధర్మానకు టెన్షన్.. సీన్ రివర్స్ అయినట్టేనా..!?
Read Latest AP News AND Telugu News
Updated Date - May 20 , 2024 | 03:44 PM