ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gidugu Rudraraju: వైఎస్ మరణంపై సీఎం జగన్ ఎందుకు సీబీఐ దర్యాప్తు కోరలేదు

ABN, Publish Date - Jan 11 , 2024 | 06:02 PM

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ( YSR ) మృతిపై సీఎం జగన్ ( CM JAGAN ) చట్టసభల్లో ఇప్పటివరకు ఎందుకు మాట్లాడట్లేదని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) ప్రశ్నించారు. గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైఎస్ మరణంపై వైసీపీ నేతలు చేసిన అర్థరహిత ఆరోపణలు సరికాదని అన్నారు.

ప్రకాశం: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ( YSR ) మృతిపై సీఎం జగన్ ( CM JAGAN ) చట్టసభల్లో ఇప్పటివరకు ఎందుకు మాట్లాడట్లేదని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) ప్రశ్నించారు. గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైఎస్ మరణంపై వైసీపీ నేతలు చేసిన అర్థరహిత ఆరోపణలు సరికాదన్నారు. వైఎస్ మరణంపై తమకు కూడా అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు. జగన్ ఇప్పటి వరకు బీజేపీకి మద్దతుగా ఉండి కూడా సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరలేదని నిలదీశారు. వైఎస్ వివేకా మరణంపై కూడా ముఖ్యమంత్రిగా ఉండి జగన్ ఆ కేసును ఏం చేశారని నిలదీశారు. నిజమైన వైఎస్ వారసులుగా ఆయన మరణంపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. వైఎస్ మరణంపై మొదట రిలయన్స్‌ని అనుమానించి ముఖేష్ అంబానీ చెప్పిన వ్యక్తిని రాజ్యసభ సభ్యుడిగా జగన్ చేశాడని మండిపడ్డారు. జగన్ మానసిక స్థితి చూసిన తర్వాత తమకు అనుమానాలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరూ సంతృప్తిగా లేరని అన్నారు. త్వరలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న నేతలు తిరిగి హస్తం గుటికి చేరే అవకాశం ఉందని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాష్ట్రానికి కచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తారని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 06:03 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising