ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Ministers: వరద ముంపు నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి.. ఏపీ మంత్రుల ఆదేశాలు

ABN, Publish Date - Jul 28 , 2024 | 08:35 PM

ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలు నీట మునిగాయి. అయితే ముంపు ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. కె.గంగవరం మం. కోటిపల్లి వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, మంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్‌ పర్యటించారు.

కోనసీమ: ఏపీలో భారీ వర్షాలతో పలు జిల్లాలు నీట మునిగాయి. అయితే ముంపు ప్రాంతాల్లో మంత్రులు ఆదివారం నాడు పర్యటించారు. కె.గంగవరం మండలం కోటిపల్లి వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, మంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్‌ పర్యటించారు. కుమ్మరివారి సావరం దగ్గర బలహీనంగా ఉన్న ఏటుగట్టును పరిశీలించారు. బాధితులను పరామర్శించి వారికి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సీతానగరం మండలం రాపాక వద్ద వరద నీటిలో మురిగిపోయిన పంట పొలాలను పరిశీలించారు. బొబ్బర్ లంకలో వరద తాకిడికి బలహీనపడిన ఏటిగట్టును మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. రెండు రోజుల పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పంట నష్టాన్ని పరిశీలించామని అన్నారు.

జలవనరుల శాఖను వైసీపీ భ్రష్టుపట్టించింది..

అనంతరం మీడియాతో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ఎర్రకాల్వ ఏటిగట్టుపై తట్టెడు మట్టి కూడా.. వేయకపోవడం వల్లనే నేడు వేలాది ఎకరాలు నీట మునిగాయని మండిపడ్డారు. రైతులు పంటలకు సబ్సీడి కన్నా ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారని తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పంట కాలువల్లో పూడిక తీయకపోవటం వల్ల ముంపు సమస్య వచ్చిందన్నారు. పంట నష్టం పై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని అదికారులను ఆదేశించామన్నారు. రైతులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో జలవనరుల శాఖను భ్రష్టుపట్టించిందని ధ్వజమెత్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల నగదుతో పాటు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


ఎర్రకాల్వ ఆధునీకరణ..

చాలా ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయని అన్నారు. ఎర్రకాల్వ వరద ముంపు నివారణకు తక్షణ పనులు చేపట్టామని తెలిపారు. ఎర్రకాల్వ ఆధునీకరణ పనులు చేపట్టి శాశ్వత పరిష్కారం కోసం ఎంత ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎర్ర కాలువ వరదతో ముంపుకు గురైన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. గత 12 ఏళ్లుగా ఎర్ర కాలువ వరదతో ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి శాశ్వత పరిష్కారాన్ని తమ ప్రభుత్వం చేపడుతుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.


ప్రభుత్వ సాయంపై ఆరా..

వరదల కారణంగా ప్రభుత్వ పరంగా అందిస్తున్న సాయంపై ఆరా తీశారు. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్‌తో సహా అధికారులంతా తమను బాగానే చూసుకుంటున్నారని బియ్యం, నిత్యావసర సరుకులు అందించారని ప్రజలు చెప్పడంతో మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం కొత్తగా వచ్చిందని కొంచెం కుదుటపడ్డాక అందరికీ ప్యాకేజీ చెల్లిస్తామని కొంచెం ఓపిక పట్టాలని సూచించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి వరదలు తీవ్రమైతే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. గోదావరి వరదల కారణంగా నష్టపోయిన ప్రతీ కుటుంబాన్ని ఆదుకుంటామని పేర్కొన్నారు.


వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితుల దగ్గరకు వెళ్లండి.. ఇప్పటి వరకు అందిన సాయం..? ఇంకా ఏం కావాలో తెలుసుకోండి.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని అన్నారు. అందుకే తామంతా కలిసి వచ్చామని తెలిపారు.


తక్షణమే స్పందిస్తాం..

తమది ప్రజాప్రభుత్వమని ప్రజలకు ఏ ఇబ్బందులు తలెత్తినా తక్షణమే స్పందిస్తామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించటంతో ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వరద ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో సహాయం అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని అచ్చెన్నాయుడు తెలిపారు.

Updated Date - Jul 28 , 2024 | 10:18 PM

Advertising
Advertising
<