Share News

YS Jagan: ఆత్మ రక్షణలో వైసీపీ.. అధ్యక్షుడి వ్యాఖ్యలతో అంతా అయోమయం..

ABN , Publish Date - Sep 28 , 2024 | 11:25 AM

జగన్ వ్యాఖ్యల తర్వాత వైసీపీ శ్రేణులు అయోమయంలో పడ్డారనే చర్చ జరుగుతోంది. అసలు తమ పార్టీ అధ్యక్షులు ఏం మాట్లాడారో తమకే అర్థం కాలేదని, ఇప్పటికే లడ్డూ వివాదంతో శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తమకు జగన్ వ్యాఖ్యలు..

YS Jagan: ఆత్మ రక్షణలో వైసీపీ.. అధ్యక్షుడి వ్యాఖ్యలతో అంతా అయోమయం..
YS Jagan

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ రోజురోజుకు బలహీనడుతుందనే చర్చ నడుస్తున్న వేళ.. జగన్ వ్యాఖ్యలు పార్టీని ఆత్మరక్షణలో పడేసిందా అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తిరుమల పర్యటన రద్దు తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారంటే ఏ విషయాలు ఆయన చెప్పబోతున్నారంటూ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూశారు. చివరకు తిరుమల పర్యటన రద్దుకు కారణాలు చెప్పకుండా హైందవ సంఘాల ప్రతినిధులను, ఓ రకంగా హిందు మతంపై ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. అసలు హిందూ మతం అంటే ఏమిటి.. గుడికి వెళ్తానంటే తన మతం అడుగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం తన మతమని డిక్లరేషన్‌లో రాసుకోవాలని చెప్పుకొచ్చారు. జగన్ వ్యాఖ్యల తర్వాత వైసీపీ శ్రేణులు అయోమయంలో పడ్డారనే చర్చ జరుగుతోంది. అసలు తమ పార్టీ అధ్యక్షులు ఏం మాట్లాడారో తమకే అర్థం కాలేదని, ఇప్పటికే లడ్డూ వివాదంతో శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తమకు జగన్ వ్యాఖ్యలు కొత్త తలనొప్పిని తీసుకొచ్చాయని చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏకంగా మత సంప్రదాయాలను జగన్ ప్రశ్నించడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనలు పాటించాలని చెప్పినందుకు హైందవ సంఘాల ప్రతినిధులను, హిందూ మతాన్ని జగన్ టార్గెట్ చేశారా అనే చర్చ జరుగుతోంది.

Viral Video: వామ్మో.. ఇదెక్కడి సర్‌ప్రైజ్ రా బాబూ.. బర్త్‌డే విషెస్ పేరుతో ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్‌కు నిప్పు.. తర్వాతేం జరిగిందంటే..


డిక్లరేషన్‌పై వివాదం..

తాను తిరుమల దర్శనానికి వెళ్తానంటే వివాదం చేస్తున్నారంటూ జగన్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి జగన్‌ను తిరుమల వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదు. అక్కడి నిబంధనల ప్రకారం అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. జగన్ క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని హైందవ సంఘాలు డిమాండ్ చేశాయి. తిరుమలలో అక్కడి సంప్రదాయాలను పాటించకపోయినా, గౌరవించకపోయినా భక్తుల విశ్వాసాలు దెబ్బతినే అవకాశం ఉండటంతో నిబంధనలు పాటించాలని అంతా డిమాండ్ చేశారు. చివరకు జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకుని ఏపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. డిక్లరేషన్ నిబంధనల కొత్తగా వచ్చిందేమి కాదు. కొన్ని సంవత్సారాలు ఈ సంప్రదాయం ఉంది. దేశానికి రాష్ట్రపతిగా చేసిన వ్యక్తులు సైతం డిక్లరేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ జగన్ మాత్రం తాను విశ్వసించే మతాన్ని బహిరంగంగా చెప్పడానికి ఇష్టపడకపోవడం, డిక్లరేషన్‌లో సంతకం చేయాలని అడగడంతో ఏకంగా ఆయన మత సంప్రదాయాలపై దాడి చేసే ప్రయత్నం చేశారనే విమర్శలు వస్తున్నాయి.

Gandipet Reservoir: మరో రెండు గేట్ల ఎత్తివేత..


రాజకీయ ప్రయోజనాల కోసమేనా..

తన మతం మానవత్వం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమేనని హైందవ సంఘాలు, కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. డిక్లరేషన్‌పై సంతకం చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చు. కానీ శ్రీవారిపై భక్తి కంటే రాజకీయ ప్రయోజనాలను ఆశించి.. మత సంప్రదాయాలపై వివాదం సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి జగన్ తీరుతో ఆ పార్టీ నాయకులు అయోమయంలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.


Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ

Indian Railways: పండుగల రద్దీ దృష్ట్యా 6 వేల ప్రత్యేక రైళ్లు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 28 , 2024 | 11:25 AM