ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP NEWS: జమిలీ ఎన్నికలపై పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Dec 15 , 2024 | 02:12 PM

జమిలీ ఎన్నికలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ హబ్‌గా ఏపీని తయారు చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే గూగూల్‌తో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. వీవీఐటీలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని అన్నారు.

గుంటూరు జిల్లా: జమిలీ ఎన్నికలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓకే దేశం ఓకే ఎన్నిక మంచిదేనని అన్నారు. దేశాభివృద్ధికి ఒకేసారి ఎన్నికలు ఉపయోగపడతాయని తెలిపారు. బిల్లు పెట్టిన తర్వాత ఏముందో చూడాలని అన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనలు ప్రొగ్రెసివ్‌గా ఉంటాయని తెలిపారు. వీవీఐటీలో గూగూల్ ఏఐ స్కిల్లింగ్ సెంటర్‌ను ఇవాళ(ఆదివారం) కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు.


ఎక్కువ మంది బిల్లుకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. స్కిల్ హబ్‌గా ఏపీని తయారు చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే గూగూల్‌తో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. వీవీఐటీలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని అన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇటువంటి కార్యక్రమాలు ద్వారా ఐటీలో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అంతర్జాతీయంగా ఏపీకి సంబంధాలు ఏర్పాడతాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.


జింఖానా వారి సేవలు అభినందనీయం..

అంతకుమందు.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జింఖానా వారి సేవలు అభినందనీయమని ప్రశంసించారు. జీజీహెచ్‌లో నూతన భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇవాళ(ఆదివారం) శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, ఏపీఐడీసీ ఛైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ...లీడర్ షిప్ తీసుకోని ముందుకు వెళ్తున్న జింఖానా సభ్యులు పొదిల ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్మిస్తున్న తల్లి పిల్లల వార్డుకు వినియోగిస్తున్న ప్రతి రూపాయి టాక్స్ చెల్లింపు చేసినవి అవడం ఎంతో ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.

Updated Date - Dec 15 , 2024 | 02:17 PM