ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP NEWS: వృద్ధుల వైద్య భీమాపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలి: మంత్రి పయ్యావుల కేశవ్

ABN, Publish Date - Oct 19 , 2024 | 09:51 PM

జీవిత భీమా, వైద్య భీమా ప్రీమియంలపై ఉన్న జీఎస్టీ విషయంలో మంత్రి పయ్యావుల కీలక సూచనలు చేశారు. వృద్ధుల వైద్య భీమా ప్రీమియంపై ఉన్న జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని పయ్యావుల సూచించారు. పేదలు.. మధ్య తరగతి ప్రజలకు వైద్య భీమాను చేరువ చేయాలని కేశవ్ కీలక సూచించారు.

అమరావతి: జీవిత భీమా, వైద్య భీమా ప్రీమియంలపై ఉన్న జీఎస్టీ రేటుపై మంత్రి వర్గ ఉప సంఘం. ఇవాళ(శనివారం) పునః పరిశీలించింది. దీనిపై జీఎస్టీ కౌన్సిల్‌ను మంత్రి మర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. జీఎస్టీ కౌన్సిల్ నియమించిన మంత్రి వర్గ ఉప సంఘం తొలి సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. జీవిత, వైద్య భీమా ప్రీమియంలపై 18శాతం ఉన్న జీఎస్టీని తగ్గించే దిశగా మంత్రి వర్గ ఉప సంఘంలో కీలక అంశాలపై చర్చించారు.


జీవిత భీమా, వైద్య భీమా ప్రీమియంలపై ఉన్న జీఎస్టీ విషయంలో మంత్రి పయ్యావుల కీలక సూచనలు చేశారు. వృద్ధుల వైద్య భీమా ప్రీమియంపై ఉన్న జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని పయ్యావుల సూచించారు. పేదలు, మధ్య తరగతి ప్రజలకు వైద్య భీమాను చేరువ చేయాలని సూచించారు. రూ. 5 లక్షల వరకు ఉన్న వైద్య భీమా ప్రీమియం పైనా జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.


మిగిలిన అన్ని రకాల వైద్య భీమా పాలసీలపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికే పరిమితం చేయాలని అన్నారు. ప్రీమియంపై చెల్లించే 5 శాతం జీఎస్టీలో కూడా ఇన్‌కం ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వాలని కేశవ్ సూచించారు. మానసిక వికలాంగుల వైద్య భీమా పాలసీలపై ఉన్న జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్‌కు పయ్యావుల కేశవ్ ప్రతిపాదించారు. జీఎస్టీ మినహాయింపులు, వెసులుబాటు వల్ల రాష్ట్రాల ఆదాయం తగ్గుతున్న పేదలు, వృద్ధులకు మేలు చేసేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు.

Updated Date - Oct 19 , 2024 | 09:56 PM