ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP IAS Officers Transfer: ఏపీలో మరోసారి పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. కీలక మార్పులు

ABN, Publish Date - Nov 03 , 2024 | 09:08 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఇవాళ(ఆదివారం) ఉత్తర్వులు జారీ చేశారు.

AP IAS Officers Transfer: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ(IAS Officers Transfer) చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఇవాళ(ఆదివారం) ఉత్తర్వులు జారీ చేశారు. జీఓఆర్టీ నెంబర్ 1884 జారీ చేశారు. చెరుకూరి శ్రీధర్‌ను వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.


జి లక్ష్మీషాను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. అభిషిక్త కిషోర్‌కు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా అదరపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు వహించాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు. వి సి&ఎండీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఎన్టీఆర్ వైద్య సేవ పథకం సీఈవో పోస్టులకు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఇన్‌చార్జిలను నియమించాలని వైద్యారోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ బదిలీలు చేపట్టారు. చర్యల్లో భాగంగా ఇప్పటికే ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు (శనివారం) మరికొంతమంది ఐపీఎస్‌లను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Nov 03 , 2024 | 09:08 PM