Minister Nadendla: వారిపై కఠిన చర్యలు.. మంత్రి నాందెడ్ల మాస్ వార్నింగ్
ABN, Publish Date - Aug 03 , 2024 | 03:21 PM
ఏపీ అభివృద్ధి కావాలంటే సమష్టిగా పని చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) సూచించారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఏ పార్టీ అయినా చర్యలు ఒకేలా ఉంటాయని చెప్పారు.
గుంటూరు జిల్లా: ఏపీ అభివృద్ధి కావాలంటే సమష్టిగా పని చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) సూచించారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఏ పార్టీ అయినా చర్యలు ఒకేలా ఉంటాయని చెప్పారు. శనివారం నాడు గుంటూరు జిల్లా పరిషత్ సమావేశంలో క్షేత్ర స్థాయిలో జరగాల్సిన అభివృద్ధి పనుల గురించి మంత్రి నాదెండ్ల మనోహర్ చర్చించారు.
Also Read: Satyakumar: నూతన విద్యా విధానం విద్యార్ధులకు ఓ వరం...
కఠిన చర్యలు..
ఈ సమావేశంలో అధికారులకు మంత్రి నాందెడ్ల మనోహర్ పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. పేదలకు అందించే బియ్యం పంపిణీలో వైసీపీ ప్రభుత్వంలో చాలా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రేషన్ బియ్యం దారి మళ్లించడంలో బడా బాబులు పాత్ర ఉందని విమర్శించారు. పేదలకు అందించాల్సిన రేషన్‌లో అవినీతి చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానంలో తమ నాయకుడు పవన్ కళ్యాణ్ చాలా కఠినంగా ఉన్నారని అన్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరూ కూడా ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకోవద్దని సూచించారు. రేషన్ వ్యవస్థ ద్వారా పేదలకు తక్కువ ధరకు కందిపప్పు అందిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు అందిస్తామని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.
మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉద్ఘాటించారు. మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చిత్తూరులో మూడు ఆర్టీసీ డిపోలకు చెందిన 17కొత్త బస్సులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read: AP Politics: వైసీపీలో లోకల్.. నాన్ లోకల్ వార్.. గెలిచేదెవరు..?
వైసీపీ ఆర్టీసీని గాలికి వదిలేసింది..
ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. "ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తీసుకువస్తాం. దీని కోసం పొరుగు రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత బస్సు విధానాన్ని అధ్యయనం చేస్తున్నాం. పూర్తి సమాచారం సేకరించిన అనంతరం కార్యక్రమ అమలుకు శ్రీకారం చుడతాం. ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని గాలికి వదిలేసింది. ప్రజా రవాణా వ్యవస్థను నిర్లక్ష్యం చేసింది. ఆర్టీసీ సంస్థను గాడిలో పెట్టడంతోపాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల అందించడం కోసమే కొత్త బస్సులు తెస్తున్నాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలు, భూముల దందాపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరు. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలను బయటకు తీసే క్షేత్రస్థాయి పర్యటనకు ఈనెల 5న శ్రీకారం చుడుతున్నాం" అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Purandeswari: చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆదుకునే విధంగా పని చేస్తోంది
Dokka: సమయం ఇవ్వకుండా కల్కి సినిమాలోలా కుట్రలు.. మాజీ మంత్రి ఫైర్
Read Latest AP News And Telugu News
Updated Date - Aug 03 , 2024 | 03:51 PM