ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Lokesh: క్లీన్ అండ్ గ్రీన్‌కు మంత్రి నారా లోకేష్ చర్యలు

ABN, Publish Date - Sep 29 , 2024 | 04:39 PM

‘క్లీన్ అండ్ గ్రీన్‌’లో భాగంగా మంగళగిరిలో పరిసరాల పరిశుభ్రతకు మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.

అమరావతి: ‘క్లీన్ అండ్ గ్రీన్‌’లో భాగంగా మంగళగిరిలో పరిసరాల పరిశుభ్రతకు మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరిలో ఇవాళ(ఆదివారం) మంత్రి నారా లోకేష్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా మంగళగిరిలో ‘క్లీన్ అండ్ గ్రీన్‌’కు చర్యలు చేపట్టారు. ఈ పనులను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తానని తెలిపారు.


ALSO READ: Minister Ramanaidu: జగన్ పాలనలో ఏపీకి ఎక్కువ నష్టం

ప్రతి నెలా కార్మికులకు జీతాలు..

కార్మికులను నియమించి గడ్డి తొలగింపు పనులకు మంత్రి లోకేష్ చర్యలు తీసుకున్నారు. సొంతంగా 5 గడ్డి తొలగింపు మిషన్ల కొనుగోలుతో పాటు ప్రతి నెలా కార్మికులకు జీతాలు చెల్లించనున్నారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో నియోజకవర్గంలో రోడ్లకు ఇరువైపులా గడ్డి, పిచ్చిమొక్కల తొలగింపు పనులు వేగంగా జరుగుతున్నాయి. మంత్రి లోకేష్ చూపిస్తున్న చొరవ పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


వరద బాధితులకు సాయం: మంత్రి బాల వీరాంజనేయ స్వామి

ప్రకాశం: వరద బాధితులకు కూటమి ప్రభుత్వం మంచి ప్యాకేజీ ఇచ్చిందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. బాధితులంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. బ్లూ మీడియా అపోహలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇవాళ(ఆదివారం) ప్రకాశం జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ... రాజకీయాలకు అతీతంగా వరద బాధితులకు పరిహారం అందజేశామని స్పష్టం చేశారు. వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరద బాధితులకు కోటి రూపాయల పరిహారం అందజేస్తానని చెప్పి ఎవరికి ఇచ్చారో కూడా తెలియదని విమర్శించారు. బోట్లతో ప్రకాశం బ్యారేజీని కూల్చాలని చూశారని ధ్వజమెత్తారు. తాము నిర్మించే వాళ్లమని..... వైసీపీ నేతలు విధ్వంసం చేసేవారని ఆరోపించారు. అందుకే ప్రజలు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నాయకులను ఇంటికి సాగనంపారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG Venkatesh: సిట్ ఏర్పాటుపై టీజీ వెంకటేష్ సంచలన కామెంట్స్..

PM Modi:మోదీ ఎమోషనల్.. తెలుగు వ్యక్తిపై ప్రశంసలు..

Somireddy: జగన్‌పై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Read Latest AP News and Telugu News

Updated Date - Sep 29 , 2024 | 04:53 PM