ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Narayana: ఏపీ అసెంబ్లీ, హైకోర్టును ఎలా నిర్మించనున్నారో వెల్లడించిన మంత్రి..

ABN, Publish Date - Dec 16 , 2024 | 10:02 PM

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సీఆర్డీఏ-43వ సమావేశం జరిగినట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ సమావేశంలో ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు, ఐకానిక్ బిల్టింగుల పనులకు సంబంధించి రూ.24,276 కోట్లకు ఆమోదం లభించిందని మంత్రి వెల్లడించారు.

Amaravati works

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సీఆర్డీఏ-43వ సమావేశం జరిగినట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ సమావేశంలో ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు, ఐకానిక్ బిల్టింగుల పనులకు సంబంధించి రూ.24,276 కోట్లకు ఆమోదం లభించిందని మంత్రి వెల్లడించారు. అసెంబ్లీని 103 ఎకరాల్లో నిర్మించనున్నామని, 11.22 లక్షల చదరపు అడుగుల్లో కన్స్‌స్ట్రక్షన్ జరుగుతుందని ఆయన తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ప్రజలకు ప్రవేశం కల్పించి, టవర్ పైనుంచి సిటీ మొత్తం చూసేలా రూపొందిస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.


జనవరి నుంచే..

ఏపీ హైకోర్టును 20.32 లక్షల చదరపు అడుగుల్లో 42.3 ఎకరాల్లో నిర్మించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. దీని ఎత్తు 55 మీటర్ల ఉంటుందని, నిర్మాణానికి రూ.1,048 కోట్లు ఖర్చవుతుందని మంత్రి వెల్లడించారు. నిర్మించే అయిదు టవర్లలో జీఏడీ టవర్ బేస్మెంట్, గ్రౌండ్-47 టవర్స్‌తోపాటు టెర్రస్ కూడా ఉంటుందని చెప్పారు. వీటిని 17,03,433 చదరపు అడుగుల్లో నిర్మాణం చేయనున్నట్లు నారాయణ వెల్లడించారు. అన్ని టవర్లు కలిసి 68,80,064 చదరపు అడుగుల్లో నిర్మాణం అవుతాయని మంత్రి పేర్కొన్నారు. ఈ టవర్లకు అయ్యే ఖర్చు రూ.4,608 కోట్లని ఆయన వెల్లడించారు. డిసెంబర్ నెలాఖరుకు దాదాపు అన్ని టెండర్లు ఖరారు అవుతాయని, వచ్చే ఏడాది జనవరి నుంచి రాజధాని నిర్మాణాలు పూర్తిస్థాయిలో ప్రారంభిస్తామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.


రూ.62 వేల కోట్లు ఖర్చు..

ట్రంక్ రోడ్లు 361 కిలోమీటర్లు ఉండగా సోమవారం జరిగిన సమావేశంలో 151 కిలోమీటర్లకు అథారిటీ పర్మిషన్ ఇచ్చిందని మంత్రి నారాయణ చెప్పారు. మొత్తం రూ.24,276 కోట్లకు అథారిటీ నేడు అప్రూవ్ ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకూ జరిగిన అథారిటీ మీటింగుల్లో రూ.45,249 కోట్ల పనులకు ఆమోదం లభించిందని నారాయణ చెప్పుకొచ్చారు. మొత్తం రాజధాని నిర్మాణానికి రూ.62 వేల కోట్లు ఖర్చవుతుందని మంత్రి వెల్లడించారు. అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు డిజైన్ చేసి సింగపూర్ వారి వద్ద లేఅవుట్లు ప్లాన్ చేశామని ఆయన చెప్పారు. దీంతో గత ప్రభుత్వం క్రియేట్ చేసిన హర్డిల్స్ తొలగించేందుకు 6 నెలలు సమయం పట్టిందని మంత్రి చెప్పుకొచ్చారు. 2017-18లో టెండర్లు పిలిచామని, ఆరోజుకు ఈరోజుకు ఎస్ఓఆర్ రేట్ల ఎలా మారాయే వైసీపీ నేతలు గుర్తించాలని మంత్రి అన్నారు.


బురద జల్లడం తప్ప ఏం తెలుసు..

వైసీపీ నేతలు పొంతనలేని విమర్శలు చేస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలకు బురద జల్లడం తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. ఈ రేట్లు సీఆర్డీఏ ఫైనలైజ్ చేయలేదని, గ్రూప్ ఆఫ్ సీఈలు కుర్చోని ఫైనల్ చేస్తారని ఆయన చెప్పారు. టెండర్ల ప్రాసెస్ మరో మూడ్రోజుల్లో ప్రారంభం అవుతాయని మంత్రి వెల్లడించారు. ఈ-11, ఈ-13, ఈ-15 రోడ్లను క్షేత్రస్థాయిలో తానే స్వయంగా పరిశీలించినట్లు మంత్రి చెప్పారు. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణంలో ఉన్న అడ్డంకులను రైతులతో మాట్లాడి తొలగిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఇవాళ కూడా ఉండవల్లి రైతులు 8 ఎకరాల భూమి ఇచ్చేందుకు ముందుకు వచ్చారని మంత్రి నారాయణ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Eluru: వివాదాస్పదంగా మారిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం..

Nellore: ఎప్పటిలాగానే పనికి వెళ్లారు.. అక్కడ యజమాని పెట్టింది తిని.. బాబోయ్..

AP News: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. చర్చించిన అంశాలు ఇవే..

Home Minister Anitha: వాటిని ఎదుర్కొనేందుకు పూర్తిగా సన్నద్ధం అవుతున్నాం: హోంమంత్రి అనిత..

Updated Date - Dec 16 , 2024 | 10:04 PM