ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Nimmala: ఆ పథకంపై అప్పుడే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రి ఆగ్రహం..

ABN, Publish Date - Jul 13 , 2024 | 06:00 PM

అమ్మకు వందనం (Ammaku vandanam) పథకంపై వైసీపీ, నీలి మీడియా అబద్దపు ప్రచారాలు చేస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రెస్ కౌన్సిల్‌(Press Council)కు ఫిర్యాదు చేయనున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు. ఇచ్చిన మాట తప్పే వ్యక్తి జగన్ రెడ్డి అని, ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని నిమ్మల చెప్పుకొచ్చారు.

అమరావతి: అమ్మకు వందనం (Ammaku vandanam) పథకంపై వైసీపీ, నీలి మీడియా అబద్దపు ప్రచారాలు చేస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రెస్ కౌన్సిల్‌ (Press Council)కు ఫిర్యాదు చేయనున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు. ఇచ్చిన మాట తప్పే వ్యక్తి జగన్ రెడ్డి అని, ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని నిమ్మల చెప్పుకొచ్చారు. ఆ పథకంపై ఇంకా విధివిధానాలు రూపొందించక ముందే "అమ్మకు వందనం మంగళం" అంటూ తమ పత్రికల్లో విష ప్రచారాలు చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటుందని, ప్రతి బిడ్డకూ దీన్ని అమలు చేసి తీరుతామని ఉద్ఘాటించారు.


ఎన్నికల హామీ మేరకు పెంచిన వెయ్యి రూపాయల పింఛన్‌ను ఐదు రోజుల్లోనే ఇంటికి తెచ్చి ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి నిమ్మల చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వానికి వెయ్యి రూపాయలు పెంచేందుకు ఐదేళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో అమ్మఒడి పేరుతో అమ్మలను మోసం చేశారని, వారికి ఇవ్వాల్సిన నగదులో కోతలు పెట్టారని ధ్వజమెత్తారు. ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఇసుకపై అసత్యాలు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతల దాడిని ప్రజలే తిప్పికొట్టారని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంపై ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని, లేదంటే ఈసారి ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కు పరిమితం కావడం ఖాయమని ఉద్ఘాటించారు.

ఇవి కూడా చదవండి:

Weather Report: ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న వరుణుడు.. ఇలాగే పరిస్థితి ఉంటే..!

Minister Dola: ఆ అధికారులపై మంత్రి డోలా ఆగ్రహం..

Updated Date - Jul 13 , 2024 | 06:04 PM

Advertising
Advertising
<