Nara Lokesh: ఐఐటీ విద్యార్థికి అండగా మంత్రి నారా లోకేశ్..
ABN, Publish Date - Aug 04 , 2024 | 02:08 PM
లక్నో ఐఐటీ(IIT Lucknow)లో చదవాలన్న ఓ పేద విద్యార్థి కలను ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) నెరవేర్చారు. లక్నో ఐఐటీలో కోర్సు ఫీజు రూ.4లక్షలు ఉందని, అంత ఖర్చు భరించే స్థితిలో తల్లిదండ్రులు లేరని ఎక్స్(ట్విటర్) వేదికగా లోకేశ్‌కు విద్యార్థి విన్నవించారు. దీనిపై స్పందించిన మంత్రి ఫీజు విషయం తాను చూసుకుంటానని చదువుపై దృష్టి పెట్టాలంటూ రీట్వీ్ట్ చేశారు.
అమరావతి: లక్నో ఐఐటీ(IIT Lucknow)లో చదవాలన్న ఓ పేద విద్యార్థి కలను ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) నెరవేర్చారు. లక్నో ఐఐటీలో కోర్సు ఫీజు రూ.4లక్షలు ఉందని, అంత ఖర్చు భరించే స్థితిలో తల్లిదండ్రులు లేరని ఎక్స్(ట్విటర్) వేదికగా లోకేశ్‌కు విద్యార్థి విన్నవించారు. దీనిపై స్పందించిన మంత్రి ఫీజు విషయం తాను చూసుకుంటానని చదువుపై దృష్టి పెట్టాలంటూ రీట్వీ్ట్ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామానికి చెందిన బసవయ్య అనే విద్యార్థికి ఇటీవల లక్నో ఐఐటీలో సీటు వచ్చింది. అయితే కోర్సు ఫీజ్ రూ.4లక్షలు ఉండడం, అంత ఖర్చు భరించే స్థితిలో కుటుంబం లేకపోవడంతో బసవయ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. తల్లిదండ్రులు కూడా కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆ డబ్బుతోనే ఇప్పటివరకూ అతణ్ని చదివించారు. దీంతో చదువు మానేసే పరిస్థితి ఏర్పడింది.
తన సమస్య గురించి విద్యార్థి బసవయ్య ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేశ్‌కు ట్వీట్ చేశారు. తనకు లక్నో ఐఐటీలో సీటు వచ్చిందని ఫీజు నిమిత్తం రూ.4లక్షలు చెల్లించాలని వివరించారు. అయితే డబ్బులు చెల్లించే ఆర్థిక స్తోమత తమకు లేదని తెలిపారు. చదువుకోవాలనే కోరిక బాగా ఉందని, తన పరిస్థితి చూసి సాయం చేయాలని కోరారు.
విద్యార్థి బసవయ్య ట్వీట్‌కు మంత్రి నారా లోకేశ్ రీట్వీట్ చేశారు. "బసవయ్య నువ్వు ఐఐటీ లక్నోలో చదువుతావు. నీ కల నెరవేరుతుంది. నీ ఫీజు విషయం నేను చూసుకుంటా. నీకు శుభాకాంక్షలు" అంటూ మంత్రి స్పందించారు. లోకేశ్ మంచి మనసు చూసి పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారంటూ ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు కామెంట్లు పెడుతున్నారు. విద్యార్థి కుటుంబసభ్యులు సైతం లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Buddha Venkanna: వల్లభనేని వంశీ ఎక్కడ కనిపించినా పోలీసులకు పట్టించండి..
SBI Robbery: ఆ జిల్లాలో ఎస్‌బీఐకు షాక్ ఇస్తున్న దొంగలు..
Srinivasa Varma: సీఎం చంద్రబాబు పాలనలో ఏపీ అభివృద్ధి పరుగులు..
Updated Date - Aug 04 , 2024 | 02:15 PM